హైపర్ టెన్షన్ అదుపు కావాలంటే…

Lower-the-Risk-From-Heart-Attack-And-Brain-Stroke-for-90-percent-With-Only-One-Ingredient
Spread the love

గుండె సంబంధిత వ్యాధులు,కిడ్నీ ఫెయిల్యూర్స్‌… దాదాపు ప్రపంచవ్యాప్తంగా 90శాతం మరణాలకు కారణమవుతున్నది హైపర్‌టెన్షన్‌. దాంతో సఫర్‌ అవుతున్నామన్న విషయమే చాలా మందికి తెలియదు. అలాగని అదేం నివారించలేనిది కాదు. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు…

వెల్లుల్లి… చాలా మంచిది. ఇది రక్తనాళాలకు విశ్రాంతి ఇస్తుంది. నైట్రిక్‌ ఆక్సైడ్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ల ఉత్పత్తిని పెంచి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. మధ్యలో ఉన్న గ్యాస్‌ను తొలగిస్తుంది. గుండె మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. రెండు మూడు వెల్లుల్లి పాయలను కాస్త మెత్తగా దంచి… రోజువారి ఆహారంలో చేర్చండి.

కొబ్బరినీళ్లలో విటమిన్‌ సి, పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఇది కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు సిస్టోలిక్‌ బ్లడ్‌ప్రెజర్‌ను తగ్గిస్తుంది. ఉదయం, సాయంత్రం ఒక్కో కప్పు కొబ్బరినీళ్లు ఎంతో మేలు చేస్తాయి.

సోడియం ప్రభావాన్ని తగ్గించే గుణం పొటాషియంలో ఉంటుంది. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినడం అలవాటుగా చేసుకోండి. మొరంగడ్డలు, పాలకూర, బచ్చలికూర కూడా ఆహారంలో చేర్చండి.

మందార పువ్వులు సైతం రక్త సరఫరాకు తోడ్పడతాయి. రెండు కప్పుల నీటిలో రెండు చెంచాలా మందార పువ్వుల పొడిని వేసి వేడి చేయాలి. దానికి కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం తేనె చేర్చి రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోండి.
ఇవన్నీ ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ఆల్కహాల్‌, పొగాకుకు దూరంగా ఉండాలి.


Related News

hair-loss_625x350_41433404875

పట్టులాంటి జుట్టు కోసం ఉల్లిపొట్టు

Spread the loveసాధారణంగా మనకు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉండనే ఉంది. మరిRead More

Illustration showing the process of ateriosclerosis

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌…

Spread the loveశరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే సంగతి తెలిసిందే. కొవ్వు అధికంగా ఉండటంRead More

 • విటమిన్ డి అత్యవసరం…
 • ఫార్టీ దాటితే తప్పదు..
 • హైపర్ టెన్షన్ అదుపు కావాలంటే…
 • నీరసాన్ని తగ్గిస్తాయి
 • వెన్నునొప్పి తగ్గాలంటే…
 • నువ్వులతో గ్యాస్ ట్రబుల్స్ కు చెక్
 • బట్టతలకు గోంగూర మందు
 • బ‌రువు ఇలా కూడా పెరుగుతారు..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *