Main Menu

ఆక‌లి సమ‌స్య తీరేందుకు

Spread the love

ఆక‌లి..ఒక‌ప్పుడు దాన్ని తీర్చేందుకు చాలామంది క‌ష్ట‌ప‌డే వారు. కానీ ఇప్పుడు మారిన ప‌రిస్థితుల్లో ఆక‌లి ఉండ‌డం లేద‌నే ఆవేద‌న చాలామందిలో ఉంది. ముఖ్యంగా జీవ‌న‌శైలి మార‌డంతో చాలామందికి ఆక‌లి అస‌లు స‌మ‌స్య‌గా త‌యార‌వుతోంది.

– జీర్ణక్రియను వేగవంతం చేయడంలో నిమ్మరసం భలేగా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలిగించి ఆకలి పుట్టేలా చేస్తుంది. ఆకలి మందగించినపుడు గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోండి. కాసేపటికి ఆకలి బాగా వేస్తుంది.

– పోషక విలువులు మెండుగా ఉన్నా ఖర్జూరాలకు ఆకలి పుట్టించే గుణం కూడా ఎక్కువే. దీన్ని రసంలా చేసి కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ నాలుగైదు ఖర్జూరాలు తింటే ఆకలి లేమి తీరిపోతుంది.

– వికారం, అజీర్తికి అల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ నాలుగైదు అల్లం ముక్కలను దవడకు పెట్టుకుని నమిలి, ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. దీనివల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆకలి కూడా వేస్తుంది.

– పొట్టలో గ్యాస్‌ను బయటకు తోసేయడంలో మెంతులు బాగా పని చేస్తాయి. దీంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ మెంతిపొడిని తేనెతో కలిపి తగిన మోతాదులో తీసుకుంటే ఆకలి పుడుతుంది.

– ద్రాక్షలో విటమిన్‌-సి ఉంటుంది. అది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. భోజనం చేశాక కొన్ని ద్రాక్షపళ్లు తినండి. తీసుకున్న ఆహారం తొందరగా అరుగుతుంది.






Related News

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

బ‌రువు త‌గ్గడానికి..

Spread the loveవెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *