Main Menu

దానిమ్మ‌..ఆరోగ్యం మిన్న‌

Spread the love

దానిమ్మ పండును ఒలుచుకుని తినడానికి ఓపిక ఉండాలే కానీ.. ఇక ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. దీన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్లను రానివ్వదు. అధిక రక్తపోటును అదుపులో ఉంచి రక్త సరఫరా సాఫీగా జరిగేలా చూస్తుంది. మధుమేహం, ఎముకలు పెళుసుబారటం, కీళ్ల నొప్పులు, వాపులు, గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.

గుప్పెడు గింజల్లోనే 83 కేలరీలని అందించి చెడుకొవ్వును కరిగించేస్తుంది. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచి సన్నబడేలా చేస్తుంది. క్రమం తప్పకుండా తిన్నారనుకోండి చర్మం మీద ముడతలు రావు. ఆటలాడే వేళ తల్లిలా అలసట తీర్చేస్తుంది.

ఇందులో విటమిన్‌ ఎ, సి, ఈ, బి6, ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియం ఫాస్ఫరస్‌, కాల్షియం, మెగ్నీషియం, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, నియాసిన్‌, రైబోఫ్లేవిన్‌, పీచు ఇవన్నీ .. నిద్రలేమి, దంత సమస్యలు, గొంతు నొప్పి, మతి మరుపు, నీరసం, అలసట, మూత్రపిండాల్లో రాళ్లు వంటి వాటిని నిరోధిస్తాయి. అందుకే వ్యాధి నిరోధక శక్తిని పెంచి సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.






Related News

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

బ‌రువు త‌గ్గడానికి..

Spread the loveవెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *