ఆరోగ్యానికి ఇవి అవ‌స‌రం!

19_adam-senn-mens-health-roberto-baldassarre-photography-dolce-e-gabbana-
Spread the love

సీజన్‌ మారింది… వర్షాలోస్తున్నాయి… సీజనల్‌ వ్యాధులైన జలుబు, దగ్గు, జ్వరాలకు దూరంగా ఉండాలంటే తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరం మారడానికి కాస్త సమయం పడుతుంది. అలాంటి సమయంలో కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

వర్షాల వల్ల కొత్త నీరు రావడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అలాగే ఆహారం, మంచి నీరు, దోమలు, ఈగల వల్ల కూడా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆహార పరిశుభ్రత లోపిస్తే అతిసార, కామెర్లు, టైపాయిడ్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఇక తాగునీటితో పాటు పరిసరాలు పరిశుభ్రత లోపించినా పై జబ్బులు వచ్చి తీరతాయి.

దోమకాటుతో మలేరియా, డెంగ్యూ, ఈగలతో టైపాయిడ్‌ వంటి వ్యాధులు వచ్చి ఆరోగ్యపరంగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

ఈ కాలంలో చాలా మంది జలుబుతో ఇబ్బంది పడతారు. పెద్దవాళైతే ఎలాగైనా తట్టుకుంటారు కానీ పిల్లలు నీరసించిపోతారు. జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌లకు నివారించుకోవడానికి ఎక్కువ హానికరం కానీ మందులను ఉపయోగించాలి. జలుబు పూర్తిగా తగ్గే వరకు రోజూకు మూడు సార్లు వేడి నీళ్లల్లో ఉప్పు వేసుకొని పుక్కిలించాలి. అలాగే వేడి నీటిలో పసుపు వేసుకొని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు ఉపశమనాన్ని పొందుతారు.

ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి కాచివడబోసిన నీళ్లను తాగడం మంచిది. నిమ్మకాయ ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులను త్వరగా తగ్గించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆహారంలో కచ్చితంగా నిమ్మరసం తీసుకోవాలి. ు






Related News

beautiful girl sleeps in the bedroom

ప్రశాంతంగా నిద్రపోవాలంటే…

Spread the loveమనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కంటే మించినది మరొకటి లేదు. శరీర పెరుగుదల, మెదడులోని కణాలు కమ్యూనికేషన్‌Read More

cycling

సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..

Spread the loveసైకిల్‌ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది.Read More

  • లిక్కర్ క్యాన్సర్ కారకం…
  • డిప్రెషన్ కి వెల్లుల్లి
  • జలుబు కి ముగింపు..
  • పొడిచర్మానికి ప్రత్యేకంగా…
  • తినాలనిపించడం లేదా…
  • అలా చేస్తే జుట్టు ఊడిపోతుంది…
  • పొట్ట తగ్గాలంటే…
  • రోజూ చేయండి…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *