Main Menu

చలివేళ‌లో ఆరోగ్యం

Spread the love

చలికాలం మొదలైంది. చలితో పాటు పిల్లల్లో జలుబుతో ముక్కులు కారడం సహజం. జలుబు, ముక్కు కారడం, ముక్కు బ్లాక్‌ అవ్వడం వంటివి ఈ కాలంలో తరచూ చూస్తుంటాం. జలుబు పిల్లలను ఆడుకోనివ్వకుండా, అలసిపోయేలా చేస్తుంది. జలుబుకు మందులకంటే సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా త్వరగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు ముక్కు బ్లాక్‌ అయి ఊపిరి అందనప్పుడు వారు పడే ఇబ్బందిని మనం చూడలేం. అలాంటప్పుడు కొన్ని సహజ పద్ధతులను, ఔషధాలను ఉపయోగించి ఎలా ఉపశమనం కలిగించాలో చూద్దాం..

జలుబు పిల్లలకు చికాకును కలిగిస్తూ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. అందుకే ఈ సమయంలో వారు ఎక్కువ విశ్రాంతి తీసుకునేలా చూడాలి. వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చడం వల్ల పిల్లలు జలుబు నుండి త్వరగా ఉపశమనాన్ని పొందుతారు. పిల్లల గదిలో తేమభరిత వాతావరణం అధికంగా ఉండేలా చూడాలి. వేడిపాలల్లో చిటికెడు పసుపు వేసి తాగిస్తే జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కొంతమంది పిల్లలకు మిరియాల పాలు కూడా ఇస్తుంటారు. ఇది కూడా మంచిదే. కానీ పిల్లల అలవాట్లను అనుసరించి మిరియాల పొడి ఇవ్వచ్చా లేదా అనేది చూసుకుంటే మంచిది. అలాగే వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టిస్తే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. పిల్లల వయసు ఎక్కువగా ఉంటే సలైన్‌ డ్రాప్స్‌ ద్వారా ముక్కును శుభ్రం చేయవచ్చు. ఇలా చేస్తే కూడా ముక్కు దిబ్బడ వెంటనే తగ్గిపోతుంది. పిల్లలు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయసువారైతే వారికి వేడివేడి ద్రవపదార్థాలను పట్టించడం ద్వారా జలుబు, గొంతునొప్పి నుండి ఉపశమనం లభించడంతో పాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *