రోజూ చేయండి…

walking-600x399
Spread the love

అమ్మాయిలను ఎక్కువగా వేధిస్తున్న సమస్య బరువు పెరగడం. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి వల్ల బరువు అదుపులో లేకుండా పోతుంది. చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువట. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పని సరి!
హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా శరీర బరువు పెరుగుతారు. శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సమయం కూర్చోవడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీర బరువు పెరుగుతారు. ఈ సమస్యలను దూరం చేసుకోవాలంటే ఎరోబిక్‌ వ్యాయామలు చేయడం కీలకం.

ఎక్కువగా ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. తక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే సహజంగా చెడు కొలెస్ట్రాల్‌ శాతం పెరుగుతుంది.

మెనోపాజ్‌ దశలో ఎక్కువగా శరీర బరువు పెరుగుతారు. ఎందుకంటే ఆ దశలో ఈస్ట్రోజెన్‌ లెవల్స్‌ తగ్గుతాయి. క్రమంగా పీరియడ్‌ కావడం అగిపోతుంది. కాబట్టి పొత్తి కడుపు ఉబ్బినట్టు అనిపించడం, బరువు పెరగడం వంటివి జరుగుతాయి.

వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటేే ఎన్ని రోగాలు వచ్చిన తట్టుకోగల్గుతారు. ఫ్లోరా, మైక్రోబిన్‌ వంటి బ్యాక్టీరియా వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాల వల్ల కూడా బరువు పెరుగుతారు. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం కీలకం.
బాగా ఒత్తిడికి గురైతే కూడా శరీర బరువు పెరుగుతారు. ఒత్తిడి కలిగించే హార్మోన్లు శరీరంలోకి విడుదల కావడం వల్ల తెలియకుండానే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల బరువు, కొలెస్ట్రాల్‌ శాతం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి కాపాడుకోవాలంటే వ్యాయామం తప్పని సరి!
శరీర బరువు తగ్గాలంటే ఆహారం వేళకు తీసుకోవడంతో పాటు తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఉదయాన్నే నిద్ర లేవడం, చిన్న చిన్న మొక్కలు నాటడం వంటి పనులు చేసినా కొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి.


Related News

Woman hands putting sunscreen from a bottle on the beach with the sea in the background

సమ్మ‌ర్ లో స్కిన్ కేర్

Spread the loveఎండాకాలంలో చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తగిలితే ఒక్కోసారి చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది.Read More

Articles-Summer-Heat-07-20-16

వేస‌విలో ఇలా..

Spread the loveఎండ‌లు మండుతున్నాయి. మార్చి మొద‌ట్లోనే మంట పుట్టిస్తున్నాయి. ఉద‌యం 10 త‌ర్వాత‌ ఆరుబ‌య‌ట అడుగు పెట్టాల‌న్నా అమ్మోRead More

 • పెరుగుతో హైబీపీకి చెక్
 • బరువే భారం అయితే…
 • బరువు తగ్గాలంటే ఇలా చేయాలి…
 • ప్రశాంతంగా నిద్రపోవాలంటే…
 • సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..
 • లిక్కర్ క్యాన్సర్ కారకం…
 • డిప్రెషన్ కి వెల్లుల్లి
 • జలుబు కి ముగింపు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *