Main Menu

చ‌లి వేళ‌లో జాగ్ర‌త్త‌లు

Spread the love

చ‌లి చంపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పుల‌తో అన్ని చోట్లా వ‌ణుకు పుట్టిస్తోంది. చలి మొదలైంది. దానికి తోడు వాతావరణ కాలుష్యం. ఈ రెండింటి వల్ల చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చలి వల్ల జలుబు, ఛాతీ, ఊపిరితిత్తుల బాధలు ఎక్కువవుతున్నాయి. వీటి నుంచి బయటపడటానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం…

– మైదాపిండితో చేసిన బ్రెడ్‌, బిస్కట్లు లాంటివి తినకుండా ఉంటే మంచిది. ప్రోసెస్డ్‌ ఫుడ్స్‌, చీజ్‌, నిలువ పచ్చళ్లకు దూరంగా ఉండాలి.

– రాత్రివేళల్లో చల్లని పదార్థాలు తినొద్దు. గుండె సంబంధిత సమస్యలున్న వాళ్లు అసలే తినకూడదు. ఖాళీ కడుపు తోనో లేదా లైట్‌గా ఆహారం తీసుకున్నప్పుడో పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌తో ఆవిరిపట్టుకుంటే మంచిది.

– గోరువెచ్చగా ఉండే ఫ్లూయిడ్లు తీసుకుంటే శరీరానికి ఎంతో సాంత్వనగా ఉంటుంది. వేడి ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో చేరిన నెమ్ము కరుగు తుంది.
– వెల్లుల్లి లేదా అల్లం వేసి తయారుచేసిన కాయగూరల సూప్‌ను వేడిగా తాగితే మంచిది. దీని వల్ల ఊపిరి తిత్తుల్లోని శ్లేష్మం తగ్గుతుంది.

– ఆర్గానిక్‌ బెల్లం, అల్లం రసం చుక్కలు, కచ్చాపచ్చాగా చేసిన నల్ల మిరియాల పొడి, పిప్పలి (లాంగ్‌ పెప్పర్‌) వేడి నీళ్లల్లో వేసి తాగితే ఊపిరితిత్తులకు మంచిది.
– పసుపులో ఉండే కుర్‌క్యుమిన్‌ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తాజా పసుపు వేళ్ల నుంచి తీసిన రసాన్ని వేడి సూప్స్‌లో కలుపుకుని తాగితే మంచిది.

– ఉల్లిగడ్డరసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగినా లేదా పచ్చిఉల్లిగడ్డ మీద నిమ్మరసం పిండుకుని తిన్నా ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం కరిగిపోతుంది.

– ఒక కప్పు వేడినీళ్లల్లో టేబుల్‌స్పూన్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలిపి తాగితే కూడా నెమ్ము పోతుంది. కృత్రిమమైన, రసాయన ఆరోమా స్ప్రేలను ఇంట్లో పెట్టొద్దు.






Related News

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

బ‌రువు త‌గ్గడానికి..

Spread the loveవెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *