జుట్టు రాలిపోతుందా..?

hair-loss_625x350_41433404875
Spread the love

జుట్టు అధికంగా రాలితే మానసికంగా కుంగిపోతుంటారు. అలా కుంగిపోవటం వల్ల కూడా జుట్టు ఇంకా రాలడం అధికమవుతుందని మర్చిపోవద్దు. జుట్టు అధికంగా రాలే వారు తేలికపాటి కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించి, ఉపశమనం పొందవచ్చు.

అధికంగా జుట్టు రాలిపోతుంటే మొదట ఓ రెండు విషయాలు పాటించాలి. ఒకటి పొడిజుట్టును పలుమార్లు దువ్వడం చేయకండి. దీని వల్ల జుట్టు రాలిపోయే అవకాశాలెక్కువ. ఇక రెండోది రోజూ ఉదయాన్నే తలమాడుని మసాజ్‌ చేయించుకోవాలి. దీనివల్ల పుర్రెమీద చర్మం ఉత్తేజితమవుతుంది. అలా చేయడంవల్ల జుట్టు మూలాలు ఆరంభమయ్యే చోట ఉండే చిన్నపాటి రంధ్రాలు చురుకై, ఆశించిన మంచి ఫలితం కలుగుతుంది.

ఆలివ్‌, కొబ్బరినూనెను తీసుకుని దానిలోకి రెండు చుక్కల నిమ్మరసం వేయాలి.మొత్తం కలిపి తలకి అప్లై చేయాలి. గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలని శుబ్రంగా కడగాలి.

ఒక పాత్రలో నీటిని కాచి దాంట్లో కొన్ని చుక్కల ఆలివ్‌నూనె వేయాలి. ఒక టవల్‌ని ఆ నీటిలో పిండి ముంచి తలని కవర్‌ చేసేట్లు చుట్టేయాలి. ఇది న్యాచురల్‌ స్పా అనుకోవచ్చు. వెల్లుల్లి, అల్లం, ఉల్లి రసాన్ని రాత్రి పడుకునేముందు తలకి బాగా పట్టించుకోవాలి. ఉదయం నిద్ర లేస్తూనే జుట్టును శుభ్రం చేసుకోవాలి. చక్కని ఫలితం కలుగుతుంది.






Related News

hair-loss_625x350_41433404875

పట్టులాంటి జుట్టు కోసం ఉల్లిపొట్టు

Spread the loveసాధారణంగా మనకు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉండనే ఉంది. మరిRead More

Illustration showing the process of ateriosclerosis

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌…

Spread the loveశరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే సంగతి తెలిసిందే. కొవ్వు అధికంగా ఉండటంRead More

  • విటమిన్ డి అత్యవసరం…
  • ఫార్టీ దాటితే తప్పదు..
  • హైపర్ టెన్షన్ అదుపు కావాలంటే…
  • నీరసాన్ని తగ్గిస్తాయి
  • వెన్నునొప్పి తగ్గాలంటే…
  • నువ్వులతో గ్యాస్ ట్రబుల్స్ కు చెక్
  • బట్టతలకు గోంగూర మందు
  • బ‌రువు ఇలా కూడా పెరుగుతారు..!
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *