Main Menu

జుట్టు రాల‌కుండా ఉండాలంటే..!

Spread the love

అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. వికారం, హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించటమేకాదు… జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. మెగ్నీషియం, పాస్పరస్‌, పొటాషియం వంటి పోషకాలను సమ ద్ధిగా కలిగి ఉండే అల్లం వేరు… వెంట్రుకలను బలంగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం!

తలపై చర్మం పొడిగా మారి పొలుసులుగా రాలిపోతుంటుంది. యాంటీ సెప్టిక్‌ గుణాలను కలిగి ఉండే అల్లం చుండ్రు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మన ఇంట్లోనే యాంటీ డాండ్రఫ్‌ షాంపూను సొంతంగా తయారు చేసుకోవచ్చు. రెండు చెంచాల తాజా అల్లం రసం, 3 చెంచాల నువ్వుల నూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసాలను కలపండి. ఈ మిశ్రమాన్ని తలపై చర్మంపై మసాజ్‌ చేసి, 15 నుండి 30 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. తరువాత చల్లటి నీటితో కడిగి వేయండి. ఈ మిశ్రమాన్ని వారంలో మూడు సార్లు వాడటం ద్వారా కొద్ది రోజులలోనే మీ తలపై చర్మంపై మంచి మార్పులను పొందొచ్చు.

జుట్టు రాలకుండా తగ్గించే ఉపాయాలు లేవని చాలా మంది అభిప్రాయం.కానీ, కొన్ని రకాల సహజ ఔషదాలు జుట్టు రాలే ప్రక్రియను సమర్థవంతంగా తగ్గిస్తాయి. అల్లం వాడకం వలన జుట్టు రాలే ప్రక్రియను తగ్గించటమేకాకుండా, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. అల్లం సహజంగా, రక్త ప్రసరణను ప్రేరేపించి వెంట్రుకలు తిరిగి పెరగటాన్ని అధికం చేస్తుంది. ఒక చెంచా దంచిన అల్లంను, 1 చెంచా ఆలివ్‌ ఆయిల్‌ను కలపండి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల మొదళ్ళకు అప్లై చేయండి. కొద్ది నిమిషాల పాటు అలాగే మసాజ్‌ చేసి, 30 నిమిషాల పాటు వదిలేయండి. తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూనుతో జుట్టును కడగండి. అల్లం పొడికి బదులుగా తాజాగా సేకరించిన తాజా అల్లం వేరును తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలుంటాయి. తాజా అల్లం వేరు జుట్టు పెరుగుదలకు, బలానికి కావలసిన పోషకాలను అధిక మొత్తంలో అందిస్తుంది.






Related News

ఆక‌లి సమ‌స్య తీరేందుకు

Spread the loveఆక‌లి..ఒక‌ప్పుడు దాన్ని తీర్చేందుకు చాలామంది క‌ష్ట‌ప‌డే వారు. కానీ ఇప్పుడు మారిన ప‌రిస్థితుల్లో ఆక‌లి ఉండ‌డం లేద‌నేRead More

ఒత్తిడి అధిగ‌మించాలంటే..!

Spread the loveఅనారోగ్యాలకు ఒత్తిడే కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మైగ్రేన్‌, అల్సర్లు, గుండె జబ్బులు, ఐబీఎస్‌, బీపీ, మధుమేహంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *