Main Menu

జుట్టు స‌మ‌స్య‌కు చెక్ పెట్టు..!

white hair
Spread the love

వాతావ‌ర‌ణంలో మార్పుల‌కు తోడు, ఆహార‌పు అల‌వాట్లు కూడా మ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు తీసుకొస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అలాంటి వాటిలో జ‌ట్టుకు సంబంధించి ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యువ‌త‌. ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య తెల్లజుట్టు. కొంతమంది పిల్లలకు కూడా తెల్లజుట్టు వచ్చేస్తోంది. తెల్లజుట్టు సమస్య నివారణకు చాలామంది బ్యూటీ పార్లర్లు, స్పాల వెంట తిరుగుతున్నారు. నిజానికి వయస్సుతో పాటు వెంట్రుకలు తెల్లబడటం సహజం. కానీ చిన్నవయస్సులోనే తల నెరిసిపోతే మాత్రం ఆహారంపై శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

– రోజూ తీసుకునే ఆహారంలో మల్టీ విటమిన్లు, బి కాంప్లెక్స్‌ విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.

– రోజువారీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, కోడిగుడ్డు ఎక్కువగా తీసుకోవాలి.

– ఆకుకూరలను ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది. ఆకుకూరలను వారానికి నాలుగుసార్లు తీసుకుంటే జుట్టు నెరిసే సమస్య కొంతవరకూ దూరమై, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు.

– ఆకుకూరలను ప్రతిరోజూ కప్పు తీసుకుంటే జుట్టు బాగా పెరగడంతో పాటు తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది.

– వృథా ఆలోచనలు, ఒత్తిడి కారణంగానూ తెల్లజుట్టు సమస్య వస్తుంది. అందువల్ల మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయ త్నించాలి. ఇలాచేస్తే జుట్టు నెరసిపోకుండా ఉండటమే కాకుండా, ఒత్తిడితో ఏర్పడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.






Related News

diet

ర‌క్త‌హీన‌త‌కు ఇలా అడ్డుక‌ట్ట‌వేయండి…

Spread the loveర‌క్త‌హీన‌త పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. నేటికీ మ‌హిళ‌ల్లో ప్ర‌ధానంగా ఈ స‌మ‌స్య తీవ్రంగా ఉంది. దానిని అధిగ‌మించేందుకుRead More

walking-600x399

వ‌డివ‌డిగా న‌డు..

Spread the love శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ వాకింగ్‌ చేయడం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి మార్నింగ్‌ వాక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *