Main Menu

డిప్రెషన్ కి వెల్లుల్లి

Spread the love

రోజుకో వెల్లుల్లి తింటే అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుందని చెబుతున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా వెల్లుల్లితో మానసిక సమస్యల నుంచి గట్టెక్కే మార్గం ఉందంటున్నారు. వెల్లుల్లి తినడం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుందని చెబుతున్నారు. దాంతో వెల్లుల్లిని రోజూ తింటే డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మానసిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది.

వెల్లుల్లిలో సల్ఫర్ పుష్క‌లంగా ఉంటుంది. స‌ల్ఫ‌ర్‌ రక్తనాళాల్లో గార (ప్లాక్) పేరుకుపోకుండా చూస్తుంది. ఆజోయేన్ రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. దీనివ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇందులోని అలిసిన్ రోగ‌కార‌క సూక్ష్మకిముల‌పై పోరాడుతుంది.

జ‌లుబు, శ్వాస‌కోస స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వెల్లుల్లిని రోజూ తింటే శ‌రీరంలో ఉండే వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. ఆలీల్ సల్ఫయిడ్లు కొన్ని రకాల క్యాన్సర్ల నివారణకూ తోడ్పడతాయి. దీని వ‌ల్ల క్యాన్స‌ర్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. శ‌రీరంలో ఐర‌న్ చేర‌డంతో పాటు వాపులు, నొప్పులు తగ్గుతాయి. ప్ర‌తి రోజూ నేరుగా లేదా కూర‌లో వేసుకుని వెల్లుల్లిని తిన‌వ‌చ్చు. గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ఇని త‌గ్గించి తినాలి.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *