అతిగా తినేస్తున్నారా..

కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో ఇష్టానుసారంగా స్నాక్స్ ఆరగిస్తుంటారు. తమ వెంట తెచ్చుకునే ఆహార పదార్థాలతో పాటు.. బయటి ఫుడ్స్ (స్నాక్స్)ను కూడా తింటుంటారు. ముఖ్యంగా ప్రతి గంటకో రెండు గంటలకొక సారి బిస్కట్లు, చిప్స్ వంటివి లాగించేస్తుంటారు. ఇలా ఆరగించేవారే త్వరగా ఊబకాయం బారిన పడుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆఫీసులో స్నాక్స్ తీసుకునే వారి శరీరంలోకి యేడాదికి లక్ష కాలరీలు వచ్చి చేరుతాయట. ఒకటి రెండు బిస్కట్లు కన్నా ఎక్కువ తిన్నా, మిల్క్ కాఫీ రెండు సార్లకంటే ఎక్కువ తాగితే 80 నుంచి 100 కాలరీలు అదనంగా వచ్చి చేరతాయని అంటున్నారు. అంతేకాకుండా కొందరికి కేకులు తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోకేకులో 10 నుంచి 12 గ్రాముల ఫ్యాట్, 300 నుంచి 400 కాలరీలు ఉంటాయి. ఇవి రోజుకు ఒకటి తిన్నా కూడా ఊబకాయం రావడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కూర్చుని పనిచేసే మహిళలు వీటికి ఆమడ దూరంలో ఉండాల్సిందే అని వారు చెబుతున్నారు. పనిమధ్యలో ఏదైనా తినాలని అనిపించినప్పుడు పళ్ళు, కూరగాయల ముక్కలు తినడం మేలని వారు సూచిస్తున్నారు.
Related News

దానిమ్మ..ఆరోగ్యం మిన్న
Spread the loveదానిమ్మ పండును ఒలుచుకుని తినడానికి ఓపిక ఉండాలే కానీ.. ఇక ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. దీన్లోRead More

పెరుగు..ఆరోగ్యం మెరుగు
Spread the loveమన నిత్యజీవితంలో పెరుగు ప్రాధాన్యత ఎనలేనిది. ఇందులో పుష్కలంగా ఉండే న్యూట్రిన్లు శరీరానికి ఎంతగానో ఉపయోగ పడుతాయి.Read More