Main Menu

బ్యాక్ పెయిన్ త‌గ్గడానికి త‌గిన ఆహార‌మిదే..!

Spread the love

అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో బ్యాక్ పెయిన్ సమస్య కూడా ఒకటి. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధాన కారణం, పోషకాహార లోపం. విటమిన్ డి తగినంత లేకపోయినా బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. అయితే కొందరిలో బ్యాక్‌పెయిన్ సమస్య తీవ్రంగా ఉంటుంది. మరికొందరిలో ఈ సమస్య తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకుంటే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి విటమిన్ డి ఉన్న ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చేపలు

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్ డి కూడా మనకు వాటిల్లో లభిస్తుంది. కనుక చేపలను వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు తీసుకుంటే విటమిన్ డి శరీరానికి సరిగ్గా అందుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారి బ్యాక్ పెయిన్, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

2. పాలు

పాలలో విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బ్యాక్ పెయిన్, ఇతర నొప్పులను తగ్గించుకోవచ్చు.

3. చీజ్

చీజ్‌లో కాల్షియం, విటమిన్ డిలు పుష్కలంగా లభిస్తాయి. చీజ్ తినడం వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. దీంతో అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.

4. కోడిగుడ్లు

కోడిగుడ్లలో నిత్యం మన శరీరానికి కావల్సిన విటమిన్ డి 6 శాతం లభిస్తుంది. అయితే కోడిగుడ్డు పచ్చసొనను మాత్రం పడేయరాదు. అందులోనే విటమిన్ డి మనకు లభిస్తుంది. పచ్చసొనను కూడా తింటేనే విటమిన్ డి ని పొందగలుగుతారు. తద్వారా బ్యాక్ పెయిన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.






Related News

దానిమ్మ‌..ఆరోగ్యం మిన్న‌

Spread the loveదానిమ్మ పండును ఒలుచుకుని తినడానికి ఓపిక ఉండాలే కానీ.. ఇక ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. దీన్లోRead More

పెరుగు..ఆరోగ్యం మెరుగు

Spread the loveమన నిత్యజీవితంలో పెరుగు ప్రాధాన్యత ఎనలేనిది. ఇందులో పుష్కలంగా ఉండే న్యూట్రిన్లు శరీరానికి ఎంతగానో ఉపయోగ పడుతాయి.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *