Main Menu

దంత సిరి ద‌ర్జాగా ఉండాలంటే..

Spread the love

దంతాలు సుర‌క్షితంగా లేక‌పోతే చాలా చిక్కులు త‌ప్ప‌వు. దంత స‌మ‌స్య‌లు వ‌ర్త‌మానంలో చాలా పెరుగుతున్నాయి. మారుతున్న జీవన విధానంలో ఎన్నో మార్పులు అతి వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో ఈ మార్పులు వచ్చేశాయి. పిజ్జా, ఫాస్ట్‌ఫుడ్స్‌, బర్గర్లు ఇంకా రకరకాల ఆహారపదార్థాలకు నగరవాసులు అలవాటు పడిపోయారు. ఈ ఆహారపు అలవాట్ల వల్ల ముఖ్యంగా దంతాల పనితనం పంటి ఎనామిల్‌ని పాడుచేసి, దాని పటుత్వాన్ని పోగొడుతుంది. దీంతో క్రమంగా దంతాలు చెడిపోవడం, తర్వాత ఊడిపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యని అధిగమించాలంటే.. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే చాలు. ఇవి దంతాలను కాపాడడంలో దోహదపడతాయి. అవేంటో తెలుసుకుందాం.

ఉల్లిపాయలు: ఇవి అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా బ్యాక్టీరియాని పోగొట్టి నోటిని, శరీరాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది. కాబట్టి దీనిని రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం.

నువ్వులు: ఈ చిన్న గింజలలో ఉండే అధిక క్యాల్షియం దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడతాయి.

కూర: భారతీయ ఆహారంలో ఇది తప్పనిసరి అయినప్పటికీ, కూరలు మసాలాతో ఉండడం వల్ల, అందులోని దినుసులు ఆమ్లాన్ని ఎక్కువగా తయారుచేస్తాయి. దాన్ని తిన్న తరువాత తప్పనిసరిగా నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే దంతాల పటుత్వం తగ్గిపోతుంది.

ఇలాంటి జాగ్ర‌త్త‌ల‌తో కొంత‌వ‌ర‌కూ దంద సంర‌క్ష‌ణ జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.






Related News

తెల్ల జుట్టు స‌మ‌స్య నివార‌ణ‌కు..!

Spread the loveకరివేపాకు కూరల్లో రుచికే కాదు.. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి, చర్మ సౌందర్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో బీటాRead More

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *