చుండ్రు స‌మ‌స్య వైదొల‌గ‌డానికి మార్గాలు

hair-loss_625x350_41433404875
Spread the love

చుండ్రుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా..ప్ర‌య‌త్నాలు ఫలించ‌డం లేదా..అయితే ఓమారు ఈ ప్ర‌య‌త్నాలు చేయండి. ఖచ్చితంగా ఫ‌లితం సాధిస్తారు. విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు : ఇందులో యాంటీ ఫంగల్‌ గుణాలు పుష్కలం. ఒక కప్పు పెరుగులో చిటికెడు నల్లమిరియాల పొడిని చేర్చి తలకు అప్లై చేయాలి. అరగంట తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

టొమాటొ : ఆయిలీ హెయిర్‌ ఉన్న వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. టొమాటొను కట్‌ చేసి విత్తనాలు తీసివేసి గుజ్జుగా చేసుకోవాలి. తరువాత ఒక స్పూన్‌ ముల్తాని మిట్టిని చేర్చి మిశ్రమంలా చేసుకుని తలకు పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తసరఫరా మెరుగుపడి చుండ్రు సమస్య తగ్గుతుంది.

మెంతులు : రాత్రంతా మెంతులను నానబెట్టి ఉదయాన పేస్టు మాదిరిగా చేసి తలకు పట్టించాలి. నలభైఐదు నిమిషాలు వదిలేసి షాంపూతో స్నానం చేయాలి.

అలొవెరా : కలబందను కట్‌ చేసి జెల్‌ తీసుకుని తలకు పట్టించాలి. కలబందలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఫంగ్‌సను తొలగిస్తాయి.

నిమ్మరసం : ఒక చిన్నపాత్రలో నిమ్మరసం తీసుకుని అందులో కొంచెం తేనెను చేర్చి తలకు అప్లై చేయాలి. నిమ్మలో ఉండే సిట్రికాసిడ్‌ చుండ్రును తొలగిస్తుంది. తేనె జుట్టుకు కావలసిన మాయిశ్చర్‌ను అందిస్తుంది.

శనగపిండి : రెండు స్పూన్ల శనగపిండి, సగం కప్పు పెరుగును ఒక పాత్రలో వేసి కలుపుకుని తలకు రాసుకోవాలి. ఇరవై నిమిషాలు వదిలేసి కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.


Related News

beautiful girl sleeps in the bedroom

ప్రశాంతంగా నిద్రపోవాలంటే…

Spread the love3Sharesమనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కంటే మించినది మరొకటి లేదు. శరీర పెరుగుదల, మెదడులోని కణాలు కమ్యూనికేషన్‌Read More

cycling

సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..

Spread the love2Sharesసైకిల్‌ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది.Read More

 • లిక్కర్ క్యాన్సర్ కారకం…
 • డిప్రెషన్ కి వెల్లుల్లి
 • జలుబు కి ముగింపు..
 • పొడిచర్మానికి ప్రత్యేకంగా…
 • తినాలనిపించడం లేదా…
 • అలా చేస్తే జుట్టు ఊడిపోతుంది…
 • పొట్ట తగ్గాలంటే…
 • రోజూ చేయండి…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *