Main Menu

సైక్లింగ్ తో ఫుల్ జోష్!

Spread the love

మారిన జీవన శైలిలో ప్రతి ఒక్కరి అవసరం. అయితే గంటల తరబడి వ్యాయామానికో, నడకకో సమయం అందరికీ చిక్కదు. అలాంటివారికి చక్కటి పరిష్కారం సైక్లింగ్‌. అసలు సైక్లింగ్‌ ఎలా చేయాలి? ఉపయోగాలేంటి? కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ఎలా చేయాలి?
ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆదుర్దా లేకుండా ప్రశాంతంగా సైకిల్‌ తొక్కడం ప్రారంభించాలి. ఇరవై నిమిషాల సైక్లింగ్‌ చాలు. గంటకు 15 కిలోమీటర్ల వేగం ఉంటే సరిపోతుంది. ఒకే సారి సైకిల్‌ తొక్కడాన్ని నిలిపివేయరాదు. నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రావాలి. సైకిల్‌ తొక్కేటప్పుడు లూజ్‌గా ఉండే దుస్తులు వేసుకోవాలి. నాలుగు రోజులు చేసి వదిలిపెట్టి మళ్లీ ప్రారంభించడం లాంటివి చేయకూడదు. క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేయాలి.మనసుకు ఆహ్లాదంగా ఉండే మ్యూజిక్‌ లేదా సినిమా పాటలు లాంటివి వింటూ కూడా సైక్లింగ్‌ చేయవచ్చు. ఇక సైక్లింగ్‌ ప్రారంభించడానికి ముందు మీ ఎత్తుకు తగినట్లుగా సీట్‌ను అడ్జెస్ట్‌ చేసుకోండి.15 నిమిషాల పాటు ఆపకుండా సైక్లింగ్‌ చేయాలి. హ్యాండిల్‌ బార్‌పై చెయ్యి ఉంచి వంగకూడదు. వీపు, నడుము నిటారుగా ఉంచాలి. ప్రతిసారీ పెడల్‌ తొక్కేటప్పుడు కాళ్లను నేరుగా చేస్తుండాలి.

ఉపయోగాలేంటి?
గుండె కొట్టుకోవడాన్ని సక్ర మంగా ఉంచడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు రావు. రక్తపు పోటు, బిపిలను అదుపులో ఉంచడంలో జాగింగ్‌కన్నా కూడా ఎక్కువ పరిణామకారి. దీనివల్ల కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు. పొట్ట సైజు, కొవ్వును తగ్గించుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి మంచి సాధనం. శరీరం కింది భాగానికి ఎక్కువ వ్యాయామం లభించి కాళ్లు దృఢంగా తయారవుతాయి. ఈ సైక్లింగ్‌ వల్ల అరగంటలో 330 కేలరీలు ఖర్చవుతాయి. అందువల్ల నడకకన్నా కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీని వల్ల కూర్చోవడం, లేవడం, నడవడం, నిలబడ్డం లాంటి అనేక శారీరక ప్రక్రియలు సులభమవుతాయి. అజీర్ణం లాంటి సమస్యలు దూరమవుతాయి. నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. స్త్రీలలో నెలసరికి ముందు వచ్చే నొప్పి, ఇబ్బందులను దూరం చేస్తుంది. వెన్నెముక సక్రమంగా ఉంటుంది. బాడీ షేప్‌ కూడా ఆకర్షణీయంగా తయారవుతుంది.






Related News

దానిమ్మ‌..ఆరోగ్యం మిన్న‌

Spread the loveదానిమ్మ పండును ఒలుచుకుని తినడానికి ఓపిక ఉండాలే కానీ.. ఇక ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. దీన్లోRead More

పెరుగు..ఆరోగ్యం మెరుగు

Spread the loveమన నిత్యజీవితంలో పెరుగు ప్రాధాన్యత ఎనలేనిది. ఇందులో పుష్కలంగా ఉండే న్యూట్రిన్లు శరీరానికి ఎంతగానో ఉపయోగ పడుతాయి.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *