Main Menu

పెరుగుతో హైబీపీకి చెక్

Spread the love

మీరు అధిక రక్తపోటు (హైబీపీ)తో సతమతమవుతున్నారా… అయితే ఆహారంలో రోజూ పెరుగు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పెరుగుతోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడొచ్చని వారు అంటున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం… అధిక రక్తపోటుతో బాధపడుతున్న 30 – 55 మధ్య వయసున్న 55వేల మంది మహిళలు, 40-75 మధ్య వయసున్న 18వేల మంది పురుషులపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వారంపాటు.. రోజూ 60 మి.లీ పరిమాణంలో పెరుగు తినమని సూచించారు. వారం తర్వాత వీరిపై మళ్లీ పరిశోధనలు చేయగా… శాస్త్రవేత్తలకు సరికొత్త విషయాలు తెలిశాయి. పెరుగు తీసుకున్నవారిలో చాలా మందికి.. గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం వరకు తగ్గినట్లు గ్రహించారు. మిగతావారిలోనూ ఈ అవకాశం చాలావరకు తగ్గినట్లు అధ్యయనంలో తేలింది.






Related News

జుట్టు నెరిసిపోతుందా…ప‌రిష్కార‌మిదే!

Spread the loveసాధారణంగా వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతాయి. కానీ ప్రస్తుతకాలంలో చిన్న వయసులోనే జుట్టు రంగుRead More

ఆల‌శ్యంగా తింటే అంతే..!

Spread the loveఎవరైనా అర్ధరాత్రి తిండి తింటుంటే ‘దెయ్యం తిండి తినటం మంచిది కాదు’ అంటారు పెద్దలు. నిజమే.. వేళాపాలాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *