Main Menu

రోజూ ఒక గ్లాసు తాగితే..!

Spread the love

క్యారెట్‌ను పచ్చిగా లేదా ఉడికించి ఎలా తిన్నా మంచిదే. అయితే ఎక్కువ తినలేం కాబట్టి జ్యూస్‌ రూపంలో తీసుకుంటే మంచిది అంటున్నారు వైద్యులు. క్యారెట్లలో బయోటిన్‌, మాలిబ్డనమ్‌, పీచు, పొటాషియం, విటమిన్‌-కె, బి1, బి6, బి2, సి, ఇ, మాంగనీస్‌, నియాసిన్‌, పాంటోథెనిక్‌ ఆమ్లం, ఫాస్ఫరస్‌, కాపర్‌… వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి కారణంగా ఇవి అనేక వ్యాధుల్ని నిరోధిస్తాయి. ఇందులోని బీటా కెరోటిన్‌ కారణంగా కంటి కండరాలు క్షీణించ కుండా ఉంటాయి. రోజూ ఓ గ్లాసు క్యారెట్‌ జ్యూస్‌ తాగితే రోగనిరోధకశక్తి పెరుగు తుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది.

పొటాషియం కారణంగా కొలెస్ట్రాల్‌ శాతం తగ్గుతుంది. విటమిన్‌-కె రక్తం గడ్డ కట్టేందుకు దోహదపడుతుంది. ఈ రెండూ ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే వీటిల్లోని విటమిన్‌-సి గాయాల్ని త్వరగా మానేలా చేస్తుంది.

క్యారెట్లలోని కెరోటినాయిడ్లు యాంటీ క్యాన్సర్‌ కారకాలు. మూత్రాశయ, ప్రొస్టేట్‌, పేగు, రొమ్ము క్యాన్సర్ల బారి నుండి కాపాడుతాయి.

క్యారెట్‌ రసాన్ని రోజూ తాగడం వల్ల కాలేయం పనితీరు బాగుంటుంది.అలాగే శరీరంలోని మలీనాలు బయటకు పోతాయి. జలుబు, జ్వరం, ఫ్లూ, బ్రాంకైటిస్‌, అల్సర్లు, సొరియాసిస్‌… వంటివి రాకుండా ఉంటాయి.

నెలసరి సరిగ్గా రానివాళ్లు రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. గర్భిణిలకు ఇది చాలా మంచిదే.

ఇందులో బి-కాంప్లెక్స్‌, విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియ వేగం పెరుగుతుంది. ముఖ్యంగా గర్భిణిలు రక్తహీనతతో బాధపడితే పుట్టేపిల్లలు మరణించే శాతం ఎక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది. కాబట్టి తల్లుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






Related News

ఆరోగ్యానికి తాటిమంజ‌లు!

Spread the love ఎండాకాలంలో తాటిముంజలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని ఈ కాలంలో తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శరీరాన్నిRead More

తెల్ల జుట్టు స‌మ‌స్య నివార‌ణ‌కు..!

Spread the loveకరివేపాకు కూరల్లో రుచికే కాదు.. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి, చర్మ సౌందర్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో బీటాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *