Main Menu

ట‌మోటా తింటున్నారా..!

Spread the love

కూరల్లో.. చారుల్లో వేసుకునే టమాటోల్లోని పోషకాల గురించి తెలిసిందే. అయితే ఇది ఆరోగ్యానికే కాదు, అందానికీ తోడ్పడుతుంది. దీన్ని జ్యూస్‌ రూపంలో తీసుకుంటే అందులోని ఎ, సి విటమిన్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. దంతాల, ఎముకల ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తాయి. ఇందు లోని నియాసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

– ఇందులో అధికంగా ఉండే పీచు ఆకలిని, బరువును తగ్గించేందుకు తోడ్పడు తుంది. మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు కాలేయ ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తుంది. టమాటోల్లో సమృద్ధిగా ఉండే బి6 గుండె జబ్బులకు కారణ మైన హోమోసిస్టీన్‌ అనే పదార్థాన్ని విచ్ఛిన్న మయ్యేలా చేస్తుంది.

– టమాటోల్లో పుష్కలంగా ఉండే క్లోరిన్‌ శరీరం లోని టాక్సిన్లు తొలగిపోయేలా చూస్తుంది.

అన్నింటికన్నా ముఖ్యంగా వీటిల్లో అధికంగా ఉండే లైకోపీన్‌ ప్రొస్టేట్‌, రొమ్ము, కొలొరెక్టల్‌, ఊపిరి తిత్తులు, క్లోమ క్యాన్సర్లతో పాటు గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది.

– టమాటో జ్యూస్‌ తాగడం వల్ల సూర్యరశ్మి కారణంగా చర్మంమీద ఏర్పడిన ట్యాన్‌ క్రమంగా తగ్గడంతో పాటు మొటిమలు కూడా తగ్గుతాయి. ఇందులోని విటమిన్లు పొడిబారిన జుట్టును మెరిసేలా చేస్తాయి.

– తలస్నానం తర్వాత కాస్త తాజా టమాటో రసాన్ని తలకు పట్టించి ఐదు నిమిషాల తరవాత కడిగేస్తే జుట్టుకు మంచి కండిషనర్‌లా కూడా పనిచేస్తుంది.






Related News

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

బ‌రువు త‌గ్గడానికి..

Spread the loveవెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *