Main Menu

జలుబు కి ముగింపు..

Spread the love

ఈ చలికాలంలో ప్రధానంగా జలుబు సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇందుకు ఏవేవో మందులు వాడుతుంటారు. కానీ ఇంట్లోనే సామాన్యంగా దొరికే చిన్న చిన్న వాటితోనే జలుబును తగ్గించుకోవచ్చు.

జలుబును తగ్గించడంలో తులసి చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పును కలపాలి. ఇది నమిలి మింగాలి. తులసి టీ తాగినా కూడా జలుబును తగ్గించుకోవచ్చు.

వేడిపాలల్లో చిటికెడు పసుపును వేసికుని రాత్రి పడుకొనే ముందు తాగితే ఉపయోగం.

రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క.. దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి దీనికి కొద్దిగా తేనేను కలిపి త్రాగితే మంచిది.
ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

పాలలో జాజికాయ, అల్లం, కుంకుమపువ్వు కలుపి ఉడకబెట్టండి. నీరు సగానికి వచ్చిన తరువాత గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేయించుకుని తినాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను తాగాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.

తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకొని సేవించినా మంచి ఫలితం ఉంటుంది.






Related News

జుట్టు నెరిసిపోతుందా…ప‌రిష్కార‌మిదే!

Spread the loveసాధారణంగా వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతాయి. కానీ ప్రస్తుతకాలంలో చిన్న వయసులోనే జుట్టు రంగుRead More

ఆల‌శ్యంగా తింటే అంతే..!

Spread the loveఎవరైనా అర్ధరాత్రి తిండి తింటుంటే ‘దెయ్యం తిండి తినటం మంచిది కాదు’ అంటారు పెద్దలు. నిజమే.. వేళాపాలాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *