వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ కష్టం మళ్లొచ్చింది

ysrcp women
Spread the love

ఏపీలో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు 67 మంది. కానీ రెండేళ్లు గడిచేసరికి ఆ సంఖ్య 46కి పడిపోయింది. ప్రస్తుతం వైఎస్ జగన్ శిబిరంలో ఉన్న నేతల్లో పలువురు రాయలసీమ , నెల్లూరు. ప్రకాశం జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. ఇతర ప్రాంతాలలో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేశారు. అలాంటి జంపింగ్స్ లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూగో, క్రుష్ణా జిల్లాల నేతలున్నారు. సీమకు చెందిన కొందరు పార్టీ మారినా అత్యధికులు వైసీపీలోనే కొనసాగుతున్నారు.

అయితే ఇప్పుడు జగన్ వెంట మిగిలిన ఎమ్మెల్యేలలో పలువురు పార్టీ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. అలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాతపట్నం ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి పేరు వినిపిస్తోంది. కర్నూలు జిల్లా కి చెందిన బాలనాగిరెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. వారితోపాటుగా శ్రీకాంత్ రెడ్డి, రోజా సహా ఇంకా చాలామంది నేతల పేర్లే ప్రచారంలో పెడుతున్నారు. ప్రతీ జిల్లాకు చెందిన కొందరి పేర్లను పనిగట్టుకుని టీడీపీ అనుకూల పత్రికల్లో పదే పదే ప్రస్తావించడం వ్యూహాత్మకమేననే వాదన వినిపిస్తోంది.

గతంలో కూడా ఇదే రీతిలో వ్యవహరించి చంద్రబాబు కొంత ఫలితం సాధించారు. ఇప్పుడు మళ్లీ అదే విధానం ముందుకు తెస్తున్నట్టు అర్థమవుతోంది. అయితే అప్పట్లో కూడా ఎమ్మెల్యేలు తాము పార్టీని వీడడం లేదని, జగన్ ని విడిచిపెట్టబోమని బహిరంగంగా చెప్పుకోవాల్సి వచ్చింది. రోజా పేరు అయితే అటు టీడీపీలోకి మళ్లీ వెళతారని కొందరు. కాదు జనసేనలోకి అంటూ మరికొందరు రాసిన చరిత్ర ఉంది. అయినా ఆమె మాత్రం ఇప్పుడు కూడా తాను చనిపోయేవరకూ జగన్ వెంటేననే చెప్పుకోవాల్సి వచ్చింది.

అయితే కొందరు నేతలు పార్టీ ఫిరాయించడానికి ముందు ఇలాంటి మాటలు చెప్పడం చాలా సహజం. ఉదయం ఒక పార్టీలో బలంగా చెప్పి, మధ్యాహ్నానికి మరో కండువాతో కనిపించిన నేతలు ఇప్పుడు చాలా సర్వసాధరణమే. కాబట్టి ఈ నేతల మాటల్లో వాస్తవికత మీద ప్రజల్లో సందేహాలు కనిపిస్తున్నాయి. కానీ కొందరు నిజాయితీగానే చెబుతుండవచ్చు. అయినా ప్రజల్లో సాగుతున్న ప్రచారం మాత్రం వారిని అనుమానంగా చూడాల్సిన స్థితికి నెడుతోంది. దాంతో పాపం..వైసీపీ ఎమ్మెల్యేలకు రెండోసారి అదే కష్టం పునరావ్రుతం అయినట్టు కనిపిస్తోంది.


Related News

ntr

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తగాదా..

Spread the loveస్టార్ డైరెక్టర్ తో యంగ్ టైగర్ వ్యవహారం వీధికెక్కింది. సినిమా షూటింగ్ కూడా ప్రారంభించిన తర్వాత ఇద్దరిRead More

jeevitha_1500457625

హీరోయిన్ అవుతున్న హీరోగారమ్మాయి…

Spread the loveప్రముఖ నటుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని హీరోయిన్ అవతారం ఎత్తనున్నారు. తమిళ చిత్ర రంగానికి శివానిRead More

 • మహేష్ 27లో మళ్లీ ఆ దర్శకుడితో…
 • సన్నీలియోన్ తో సప్తగిరి పెళ్లి..!
 • రామ్ చరణ్ కి థర్డ్ ప్లేస్
 • పొట్టిదనం జగన్ కి పేరు తెస్తుందా?
 • పవన్ తో గుడ్ కంపెనీ, గుడ్ వర్క్..
 • యనమల వియ్యంకుడికి నిరాశ..
 • జగన్ యాత్ర మళ్లీ వాయిదా వేయాల్సిందేనా?
 • ఇల్లూ బేబీ పెళ్లి…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *