జగన్ కి ఝలక్ ఇవ్వబోతున్న ఆ 10మంది

ysrcp srikanth reddy
Spread the love

నంద్యాల ఫలితం వచ్చిందో లేదో అప్పుడే టీడీపీ మైండ్ గేమ్ మొదలెట్టింది. వైసీపీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టే దిశలో ఆలోచిచస్తోంది. ఇలాంటి మైండ్ గేమ్ తోనే గతంలోనే వైసీపీని కొంత దెబ్బ కొట్టింది. ఆ ప్రభావం నుంచి ఇప్పటికీ జగన్ అండ్ కో తేరుకోలేదు. ఇప్పుడు మళ్లీ నంద్యాల ఫలితాలు అందించిన ఉత్సాహంతో మరోసారి పాత వ్యూహాన్ని తెరమీదకు తెస్తోంది. జగన్ మీద గురిపెట్టి చుట్టూ ఉన్న నేతలను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఫలానా నేత ఫిరాయించబోతున్నట్టు ప్రచారం మొదలు పెట్టి, ఆతర్వాత క్రమంగా ఆయన్ని లొంగదీసుకునే చర్యలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఆ క్రమంలో జగన్ సన్నిహితుడు, రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి చేరిపోయారు. శ్రీకాంత్ రెడ్డి జగన్ కి చిన్ననాటి స్నేహితుడు. అయితే ఇప్పుడు జగన్ వైఖరితో విబేధించి పార్టీ మారాాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం మొదలెట్టాయి టీడీపీ వర్గాలు. ఆయనతో పాటు మరో 10మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, అందరినీ సమన్వయ పరిచే బాధ్యతను శ్రీకాంత్ రెడ్డి తీసుకుంటున్నారంటూ కథనాలు కూడా వస్తున్నాయి. మరో అడుగు ముందుకేసి ఓ ఫామ్ హౌస్ లో ఈ నేతలంతా సమావేశమయినట్టు కూడా చెప్పేయడం విశేషం. వాస్తవానికి నంద్యాల ఫలితాలు వచ్చి ఇంకా పూర్తిగా ఒక్క రోజు గడవలేదు. ఈలోగా ఫిరాయింపులు, ప్రత్యేక సమావేశాలు, సీఎం రమేష్ తో మంతనాలు అంటూ కథనాలు అల్లడం వెనుక తెలుగుదేశం వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

తొలుత వైసీపీ వర్గంలో అనుమానాలు కలిగించడం, ఆ తర్వాత అనివార్యంగా పార్టీ మారాల్సిన అవసరాన్ని తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో కూడా ఇదే వ్యూహంతోనే కొందరు నేతలను తన బుట్టలో వేసుకోవడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే పద్దతిని అవలంభించాలని చూస్తున్నట్టు శ్రీకాంత్ రెడ్డి చుట్టూ సాగుతున్న చర్చ చాటుతోంది. శ్రీకాంత్ రెడ్డి ఫిరాయించడానికి సిద్ధమవుతున్నారంటే ఇంకేముందని ఊగిసలాటలో ఉన్న కొందరు తన వైపు మళ్లడానికి ఆస్కారం ఉంటుందనే అంచనాలు కూడా టీడీపీ వర్గాల్లో కనిపిస్తున్నాయి. మొత్తంగా ద్విముఖ వ్యూహంతో వైసీపీలో గందరగోళం స్రుష్టించే వ్యూహాన్ని టీడీపీ అధిష్టానం ప్రారంభించింది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.


Related News

anasuya

అనసూయ మెగాహీరోకి మేనత్తనట!

Spread the loveతెలుగు యాంకర్లు ఇప్పుడు ఒకప్పటిలా మాములుగా లేరు. ముఖ్యంగా ఈ మధ్య కొన్ని రియాలిటీ షోల ద్వారాRead More

Premam-Heroine-Sai-Pallavi-Leaked-Images-from-Rain-Songs-in-Telugu-Movie-Fidaa-with-Varun-Tej

ఆ హీరోయిన్ పేరు చెప్పగానే బాబోయ్ అంటున్న హీరో

Spread the loveప్రేమమ్ లో మలర్ పాత్రతో మళయాళంలో… ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగులో సాయి పల్లవి ప్రేక్షకులనుRead More

 • జేసీ రాజీనామాలో నిజమెంత?
 • బయట కలుద్దామని ఒత్తిడి చేశాడంటున్న హీరోయిన్
 • పీకే ఫిక్సయినట్టే..!
 • రకుల్ ని అలా చూడగానే..!
 • విశాల్ పోరాటం ఫ‌లించేనా?
 • ఎన్టీఆర్ కి కోటిమంది అయిపోయారు..!
 • త్రిష దూకేసింది..!
 • హాట్ బ్యూటీకి మహిళా కమిషన్ షాక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *