వెన‌క్కి సిద్ధ‌మంటున్న జ‌గ‌న్ ఎమ్మెల్యేలు

TDP YSRCP
Spread the love

వైసీపీ వ్య‌వ‌హారాల్లో కొత్త మ‌లుపు ఖాయంగా క‌నిపిస్తోంది. ఆపార్టీలోకి పాత‌నీరు మ‌ళ్లీ చేరేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఫ్యాన్ గుర్తుపై గెలిచి సైకిలెక్కేసిన సైన్యం మ‌రోసారి వెన‌క్కి చూస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. సొంత గూటికి చేరాల‌ని చాలామంది ఆశిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌ర్నూలు జిల్లా ఇద్ద‌రు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల నుంచి కూడా వైసీపీతో ట‌చ్ లో ఉన్న‌ట్టు చెబుతున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కూడా స్పందించారు. త‌మ నుంచి వెళ్లిన వారు మ‌ళ్లీ వ‌స్తామంటే చేర్చుకోవ‌డానికి మాకు అభ్యంత‌రం లేద‌ని ప్ర‌క‌టించారు. అంతేగాకుండా టీడీపీ నుంచి చాలామంది త‌మ‌కు సిగ్న‌ల్స్ పంపిస్తున్నార‌ని, అవ‌కాశాన్ని బ‌ట్టి వారిని కూడా పార్టీలో చేర్చుకుంటామ‌న్నారు.

దాంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు మ‌రోసారి కండువాలు మార్చేసే అవ‌కాశాలున్నాయ‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. కోడుమూరు మ‌ణిగాంధీ బ‌హిరంగంగానే దీనిని ధృవీక‌రించారు. జ‌య‌రాములు కూడా సిద్దంగా ఉన్నార‌ని, ఇద్ద‌రం క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. దాంతో క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో క‌ద‌లిక ఖాయం గా ఈ వ్యాఖ్య‌లున్నాయి. అదే విధంగా త‌మ‌కు పార్టీ మారిన‌ప్పుడు ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకోలేద‌ని ప‌లువురు భావిస్తున్నారు. కేవ‌లం న‌లుగురికి మాత్రం అమాత్య హోదా క‌ట్ట‌బెట్టి, అర‌కు ఎమ్మెల్యేని విప్ గా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ మిగిలిన నేత‌లు మాత్రం సంతృప్తిగా క‌నిపించ‌డం లేదు

మంత్రుల్లో కూడా అఖిలప్రియ‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి కాకుండా పార్ల‌మెంట్ బ‌రిలో దింపే యోచ‌న చేస్తున్నార‌నే ప్ర‌చారం ఆమెలో అసంతృప్తి రాజేస్తోంది. సొంత జిల్లాలో త‌న మాట‌ను ప‌ట్టించుకునే వారు లేక సుజ‌నా కృష్ణ‌రంగారావు కూడా సగం తృప్తితోనే కాలం వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి వారితో పాటుగా ప‌లువురు ఎమ్మెల్యేల‌యితే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌ల‌తో తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నామంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఆ 23మందిలో ఏ కొంద‌రు పీఛే మూడ్ అన్న‌ప్ప‌టికీ ప‌రిణామాలు అనూహ్యంగా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.


Related News

Rangasthalam_5745

రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..

Spread the love1Shareమెగా ప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మువీ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది. వ‌చ్చే వారిRead More

janasena pawan kalyan

ప‌వ‌న్ త‌డ‌బాటు..

Spread the loveజ‌న‌సేనాని త‌డ‌బ‌డుతున్నారు. త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ రాజ‌కీయంగా కొంత గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. దాంతో ప‌వ‌న్ తీరు చాలామందినిRead More

 • బాల‌య్య హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది..
 • ముంద‌స్తు ముప్పు త‌ప్పంది…!
 • రాజ‌కీయాల్లో కీల‌కం కాబోతున్న హీరోయిన్
 • రాజ్య‌స‌భ కోసం బీజేపీకి వైసీపీ తాయిలాలు…!
 • మంత్రి ప‌దవుల కోసం మొద‌ల‌యిన లాబీయింగ్
 • వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మేనా?
 • ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్
 • హాట్ ల‌వ‌ర్స్ బ్రేక‌ప్..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *