ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్

jagan-vijaya-645-06-1486361225-06-1499360204
Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాల‌కు అవ‌కాశం ఏర్ప‌డుతోంది. దాంతో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అప్ర‌మ‌త్తమ‌య్యారు. అందులో భాగంగా త‌న ఎమ్మెల్యేల‌ను క్యాంప్ కి త‌ర‌లించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గిన స్థానంగా గోవాని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే వైసీపీ ఎమ్మెల్యేల‌ను క్యాంప్ కి త‌ర‌లించడానికి త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి బాధ్య‌త అప్ప‌గించార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఈనెల‌లో జ‌ర‌గ‌బోతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ముఖ్యంగా మూడు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో మూడింటిని కైవ‌సం చేసుకోవాల‌ని టీడీపీ వ్యూహం ర‌చిస్తోంది. అయితే మూడో అభ్య‌ర్థిని బ‌రిలో దింపాలా లేదా అన్న‌ది దానిపై ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నట్టు స‌మాచారం. ముఖ్యంగా 23మంది ఎమ్మెల్యేలు ఫిరాయించ‌డంతో కేవ‌లం 44మంది మ్యాజిక్ ఫిగ‌ర్ మాత్ర‌మే వైసీపీకి మిగిలింది. అందులో ఒక‌రిద్ద‌రు అటూ ఇటూ అయినా రాజ్య‌స‌భ స్థానం స్వాధీనం చేసుకోగ‌ల‌మ‌ని టీడీపీలో కొంద‌రి అంచ‌నా. దానికి త‌గ్గ‌ట్టుగానే ఇప్ప‌టికే ఆరుగురు ఎమ్మెల్యేలు చంద్ర‌బాబుతో ట‌చ్ లో ఉన్నార‌నే ప్ర‌చారం టీడీపీ నేత‌లు చేస్తున్నారు.

అయినా ఇప్ప‌టికే జ‌గ‌న్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డిని రంగంలో దింప‌డం ద్వారా నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకోవ‌డానికి పావులు క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ఫిరాయింపుల్లో న‌లుగురు ఎమ్మెల్యేలు మ‌రోసారి జ‌గ‌న్ ఆశీస్సుల కోసం చూస్తున్న నేప‌థ్యంలో వారు కూడా క‌లిసొచ్చే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ అనుచ‌రులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మూడో సీటు త‌మ‌దేన‌నే ధీమాలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా క్యాంప్ నిర్వ‌హ‌ణ‌కు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. గోవాలో క్యాంప్ కోసం ఏర్పాట్లు చేస్తున్నార‌న్న ప్ర‌చారం హాట్ టాపిక్ అయ్యింది.


Related News

Rangasthalam_5745

రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..

Spread the love1Shareమెగా ప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మువీ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది. వ‌చ్చే వారిRead More

janasena pawan kalyan

ప‌వ‌న్ త‌డ‌బాటు..

Spread the loveజ‌న‌సేనాని త‌డ‌బ‌డుతున్నారు. త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ రాజ‌కీయంగా కొంత గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. దాంతో ప‌వ‌న్ తీరు చాలామందినిRead More

 • బాల‌య్య హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది..
 • ముంద‌స్తు ముప్పు త‌ప్పంది…!
 • రాజ‌కీయాల్లో కీల‌కం కాబోతున్న హీరోయిన్
 • రాజ్య‌స‌భ కోసం బీజేపీకి వైసీపీ తాయిలాలు…!
 • మంత్రి ప‌దవుల కోసం మొద‌ల‌యిన లాబీయింగ్
 • వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మేనా?
 • ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్
 • హాట్ ల‌వ‌ర్స్ బ్రేక‌ప్..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *