Main Menu

అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్న వైసీపీ!

Spread the love

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీకి అభ్య‌ర్థులు కావాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త నేత‌లు అత్య‌వ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టుగా వేట ప్రారంభించింది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో దాదాపుగా మార్చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కూ 6 జిల్లాల ప‌రిధిలో కేవ‌లం ఒకే ఒక్క అర‌కు ఎంపీ సీటుని వైసీపీ గెలుచుకోగ‌లిగింది. ఆ త‌ర్వాత గెలిచిన ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత స‌హా ప‌లువురు నేత‌లు పార్టీ నుంచి ఫిరాయించేశారు. 2014లో పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో విజ‌య‌న‌గ‌రం అభ్య‌ర్థి బేబీనాయ‌న‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అభ్య‌ర్థి బొడ్డు వెంక‌టర‌మ‌ణ‌, విజ‌య‌వాడ అభ్య‌ర్థి కొనేరు ముర‌ళీ వైసీపీని వీడిపోయారు. ఇక ఏలూరు నుంచి బ‌రిలో దిగిన తోట చంద్ర‌శేఖ‌ర్, కాకినాడ అభ్య‌ర్థి చెల‌మ‌ల‌శెట్టి సునీల్ కూడా ఢోలాయ‌మానంలో ఉన్నారు. వారికితోడుగా అమ‌లాపురం అభ్య‌ర్థిగా పోటీ చేసిన పినిపే విశ్వ‌రూప్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ కి సీటు ఖాయం చేసుకున్నారు. అన‌కాప‌ల్లి నుంచి బ‌రిలో దిగిన గుడివాడ అమ‌ర్ నాధ్ కూడా దాదాపుగా ఎమ్మెల్యే సీటు ఖాయం అంటున్నారు. మ‌చిలీప‌ట్నం నుంచి పోటీ చేసిన పార్థ‌సార‌ధి కూడా ఈసారి అసెంబ్లీ అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. విశాఖ నుంచి పోటీ చేసిన విజ‌య‌మ్మ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవకాశాలు చాలా స్వ‌ల్పం. అంతేగాకుండా శ్రీకాకుళం అభ్య‌ర్థి రెడ్డి శాంతి, న‌ర్సాపురం నుంచి పోటీ చేసిన వంక ర‌వీంద్ర‌నాధ్ ని కూడా మార్చేసే యోచ‌న‌లో వైసీపీ ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

దాంతో వైసీపీ త‌రుపున వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ అభ్య‌ర్థుల్లో పెను మార్పులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. అందుకు త‌గ్గ‌ట్టుగా కీల‌క నేత‌ల కోసం ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌న‌గ‌రం నుంచి బొత్సా ఝాన్సీ రంగంలో దిగ‌డం దాదాపు ఖాయం. ఇక కాకినాడ నుంచి సునీల్ కాదంటే కుర‌సాల క‌న్న‌బాబుని పోటీ చేయించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇక అన‌కాప‌ల్లి స్థానం కోసం ఓ టీడీపీ నేత తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. కొణ‌తాల రామ‌కృష్ణ రంగంలో దిగినా ఆశ్చ‌ర్యం లేదు.ఏలూరు స్థానాన్ని మ‌రో మాజీ ఐఏఎస్ అధికారి ఆశిస్తుండ‌గా, క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికే కేటాయించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స్థానాన్ని సినీ ప్ర‌ముఖుడికి కేటాయించే అవ‌కాశం ఉంది. ఓ స్టార్ ద‌ర్శ‌కుడు, మ‌రో సీనియ‌ర్ ప్ర‌ముఖుడు ఆశిస్తున్నారు. గ‌తంలో వైసీపీని వీడి వెళ్లిన నాయ‌కుడికి ఈసారి న‌ర్సాపురం సీటు క్ష‌త్రియ కోటాలో కేటాయించ‌బోతున్న‌ట్టు ప్రచారం మొద‌ల‌య్యింది. విజ‌య‌వాడ నుంచి ప్ర‌ముఖ నిర్మాత ఆశిస్తున్నారు. మ‌చిలీప‌ట్నం సీటు విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. వైజాగ్ ఆశావాహుల సంఖ్య పెద్ద‌దే ఉంది. అయితే అర‌కు విష‌యంలో మాత్రం వైసీపీ త‌రుపున ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న నేత బ‌రిలో దిగ‌వ‌చ్చ‌ని స‌మాచారం. శ్రీకాకుళం రెడ్డి శాంతిని కాద‌నుకుంటే కిల్లి కృపారాణికి కండువా క‌ప్పేయ‌డం ఖాయం. అమ‌లాపురం సీటుని హ‌ర్ష‌కుమార్ ఆశిస్తున్నారు. కానీ ఆయ‌న క‌న్నా కొత్త అభ్య‌ర్థి మేల‌ని వైసీపీ అధినేత భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఆరు జిల్లాల ప‌రిధిలో వైసీపీ ఎంపీ క్యాండిడేట్స్ అంతా దాదాపుగా కొత్త‌వారే ఉంటార‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు.


Related News

బాబు మీద గురిపెట్టి ఏపీకి మ‌ళ్లీ అన్యాయం..!

Spread the loveరాక రాక వ‌చ్చారు. కానీ ఏదో చేస్తార‌ని ఆశించిన వాళ్ల‌ను నిరాశ‌లో ముంచారు. ఏదో ఒక హామీRead More

బాబుకి మింగుడుప‌డ‌ని ఆమంచి ఎత్తులు

Spread the loveఆమంచి కృష్ణ‌మోహ‌న్ .ఈచీరాల ఎమ్మెల్యే ఇప్పుడు మ‌ళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. సెంట‌ర్ పాయింట్ అయ్యారు. ఏపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *