Main Menu

ఆ మంత్రి ఏమ‌య్యారు..!?

Spread the love

ఏపీలో రాజ‌కీయ వేడి రాజుకుంది. వ‌రుస‌గా నేత‌ల మాట‌ల యుద్ధానికి దిగుతున్నారు. అధికార‌, విప‌క్షాల మ‌ధ్య వాడీవేడీగా వ్య‌వ‌హారం సాగుతోంది. అయితే ఒక్క మంత్రి మాత్రం క‌నిపించ‌డం లేదు. ఉలుకూ ప‌లుకూ లేదు. ఎక్క‌డున్నారో కూడా తెలియ‌డం లేదు. దాంతో ప‌ర్యాట‌క మంత్రి వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆమె ప‌ర్య‌ట‌న‌ల్లో ఉన్నారా అని అనుమానం క‌లుగుతోంది. ప‌క్క జిల్లాలో సీఎం ధ‌ర్మ‌పోరాటం చేస్తున్నా స‌ద‌రు మంత్రి త‌న దారి త‌న‌దే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించడం విశేషంగా క‌నిపిస్తోంది.
వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన ఘ‌ట‌న త‌ర్వాత ఒక్క‌సారి రాజ‌కీయాలు వేడెక్కాయి. కానీ మంత్రి అఖిల‌ప్రియ జాడ క‌నిపించ‌డం లేదు. ఆమె నోరు మెదిప‌న దాఖ‌లాలు కూడా లేవు. ఈవిష‌యంలో జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు చేయ‌ని ఏకైక మంత్రిగా ఆమె క‌నిపిస్తున్నారు. దాదాపుగా అంద‌రూ మంత్రులు మీడియా స‌మావేశాల‌తో హోరెత్తిస్తుంటే ఆమె మాత్రం ఎందుకు మిన్న‌కుండిపోయార‌న్న‌ది మింగుడుప‌డ‌ని అంశంగా మిగిలిపోతోంది.

వాస్త‌వానికి ఆమె కొద్ది రోజుల క్రితం వివాహంచేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె పార్టీ, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో పాత్ర దాదాపుగా త‌గ్గించేశారు. అంత‌కుముందు కూడా సొంత శాఖ విష‌యాల్లో కూడా ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హారించ‌డం సీఎం కి సైతం ఆగ్ర‌హం క‌లిగించింది. కొన్ని సార్లు మందలించిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. అయినా మార్పు వ‌చ్చిన‌ట్టుగా లేదు. తాజాగా ఆమె త‌న ధోర‌ణిలోనే కొన‌సాగుతుండ‌డం టీడీపీ నేత‌ల‌కు విస్మ‌యం క‌లిగిస్తోంది. వాస్త‌వానికి అఖ‌ల‌ప్రియ కూడా చంద్ర‌బాబుకి దూర‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌చారం ఉంది. త్వ‌ర‌లోనే ఆమె జ‌న‌సేన‌లో చేర‌తార‌నే వాద‌న కూడా ఉంది. తాజాగా ఆమె టీడీపీ కీల‌క కార్య‌క్ర‌మంలో కూడా క‌నిపించ‌క‌పోవ‌డం వెనుక కార‌ణాలు ప‌లువురిని ఆలోచ‌న‌లో ప‌డేస్తున్నాయి.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *