Main Menu

జ‌న‌సేన ప్ర‌చారాస్త్రంగా విన‌య విధేయ రామ‌?

Spread the love

రామ్ చ‌ర‌ణ్, బోయ‌పాటి కాంబినేష‌న్ లో తొలి మువీ రిలీజ్ కి సిద్ధ‌మ‌య్యింది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ఈ సినిమా గ్రాండ్ స‌క్సెస్ కొడుతుంద‌ని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ పాయింట్ లీక‌య్యింది. అది రాజ‌కీయంగానూ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

రామ్ చ‌ర‌ణ్ హీరోగా డీవీవీ దాన‌య్య‌ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా జ‌నసేనానికి ప్ర‌యోజ‌నం క‌లిగించే ప్ర‌య‌త్నం సాగుతోంద‌ని ప్ర‌చారం మొద‌ల‌య్యింది,. ముఖ్యంగా కొణిదెల కుటుంబం నుంచి వ‌చ్చిన ముగ్గురు అన్న‌ద‌మ్ముల మాదిరిగానే విన‌య విధేయ రామ క‌థాంశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ వారిలో చిన్న వాడిగా ప‌వ‌న్ త‌ర‌హా పాత్ర‌ను పోషిస్తుండ‌గా, సినిమాలో పెద్ద అన్నను కొంద‌రు మోసం చేస్తే అలాంటి వారంద‌రికీ బుద్ధి చెప్పే రీతిలో విల‌న్ వివేక్ ఓబరాయ్ మీద ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి రామ్ చ‌ర‌ణ్ పాత్ర చేసే ప్ర‌య‌త్నం ప‌వ‌న్ పోరాటానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు.

వాస్త‌వానికి బోయ‌పాటి ఇలాంటి రాజ‌కీయ సినిమాల‌కు ప్ర‌సిద్ధి చెందిన ద‌ర్శ‌కుడు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు బోయ‌పాటి లెజెండ్ సినిమాలోని కొన్ని పొలిటిక‌ల్ డైలాగ్స్ హీరో బాల‌య్య ద్వారా చెప్పించి, రాజ‌కీయంగా టీడీపీ కి ల‌బ్ధి చేకూరేలా చేసిన చ‌రిత్ర ఉంది. ఈ నేప‌థ్యంలో వీవీఆర్ మువీలో రామ్ చ‌ర‌ణ్ పాత్ర చెప్ప‌బోయే డైలాగులు రాజ‌కీయ ప్ర‌భావం చూప‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో బాబాయ్ కోసం తాము ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మంటూ చెర్రీ చేసిన కామెంట్స్ , ఈ లీక‌యిన క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఉన్నాయ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. ఏమ‌యినా తాజా ప్ర‌చారం ఆస‌క్తిగా మారింది.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *