Main Menu

నాకు తిరుగులేదంటున్న విశాల్!

Spread the love

త‌మిళ సినిమా రంగంలో వివాదం రాజ‌కీయ రూపు దాల్చుతోంది. మొన్న‌టి త‌మిళ‌నాడు ఉప ఎన్నిక‌ల్లో త‌న రాజ‌కీయ విధానాల‌ను స్ప‌ష్టం చేసిన విశాల్ పై పాల‌క ప‌క్షంలోని కొంద‌రు క‌క్ష గ‌ట్టిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అందులో భాగంగానే నిర్మాత‌ల మండ‌లి రాజ‌కీయాల‌తో ఏకంగా విశాల్ ని అరెస్ట్ చేసే వ‌ర‌కూ ప రిస్థితులు వెళ్లిన‌ట్టు భావిస్తున్నారు. అయితే విశాల్ మాత్రం త‌న ప‌ట్టు వీడేలా క‌నిపించ‌డం లేదు.

తమిళంలో నిర్మాతలకు, నిర్మాతల సంఘం ప్రతినిధులకు మధ్య త‌గాదా కార‌ణంగా సంఘం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు విశాల్‌ వర్గం కాగా నిర్మాతలు అళగప్పన్, నందగోపాల్, సురేశ్‌ కమాట్చి, ఆర్‌కే సురేశ్ వంటి వారు మరో వర్గంగా ఏర్పడ్డారు. వేర్పాటు వ‌ర్గం విశాల్ పై విమ‌ర్శ‌లకు పూనుకుంది. అందులోనూ తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగింది. ఏకంగా పలు పైరసీ వెబ్‌సైట్‌లతో విశాల్ కి సంబంధాలు కూడా ఉన్నాయంటూ ఆరోపించారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా నిర్మాతల మండలి ఆఫీస్‌కు తాళం కూడా వేసేశారు.

ఆ తాళం పగలగొట్టి నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా, పోలీస్‌లు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ‘‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కు తాళం వేసినప్పుడు మౌనంగా ఉన్నారు పోలీసులు. ఇప్పుడు ఏ తప్పూ లేకపోయినా నన్ను, నా సహచరులను అరెస్ట్‌ చేస్తున్నారు. పోరాడతాం. చిన్న చిన్న కారణాలకు నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. సర్వం కోల్పోయిన నిర్మాతలకు మంచి చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు, నిజం రెండూ నా వైపే ఉన్నాయి. ముందుకు అడుగు వేస్తాను. ఇళయరాజాగారి ఈవెంట్‌ను నిర్వహించకుండా నన్ను ఎవరూ ఆపలేరు’’ అని తన వాదనను ట్వీటర్‌ ద్వారా పంచుకున్నారు విశాల్‌. త‌న‌ను ఎవ‌రూ ఆప‌లేరంటూ విశాల్ పేర్కొన్న తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజా ఆటంకాల‌ను అధిగ‌మించి ముందుకే సాగుతానంటూ విశాల్ ప‌ట్టుద‌ల‌తో సాగుతుండ‌డంతో ఈ ప‌రిణామాలు ఎటు దారితీస్తాయ‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


Related News

ద‌గ్గుబాటి వార‌సుడికి అనుకోని అడ్డంకి!

Spread the loveవ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేర‌డానికి ద‌గ్గుబాటి కుటుంబం నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే త‌న వార‌సుడినిRead More

జ‌న‌సేన ప్ర‌చారాస్త్రంగా విన‌య విధేయ రామ‌?

Spread the loveరామ్ చ‌ర‌ణ్, బోయ‌పాటి కాంబినేష‌న్ లో తొలి మువీ రిలీజ్ కి సిద్ధ‌మ‌య్యింది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *