Main Menu

మ‌ళ్లీ విద్యాబాల‌న్

Spread the love

బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ మ‌ళ్లీ సౌత్ వైపు మొగ్గు చూపింది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఈ భామ న‌టిస్తోంది. కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. దానికి తోడు తాజాగా మ‌రో ద‌క్షిణాది సినిమాకు సై అన్న‌ట్టు స‌మాచారం. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం పింక్‌. ఈ మూవీ అక్కడ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ్‌లో అజిత్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో న్యూస్‌ ఇప్పుడు బయటకు వచ్చింది.

ఈ పింక్‌ చిత్రాన్ని అజిత్‌ రీమేక్‌ చేయబోతున్నాడని.. కాదు అవన్ని రూమర్సే అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని అజిత్‌ రీమేక్‌ చేయనున్నాడు. ఇందులో ఓ ప్రముఖ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ నటి విద్యాబాలన్‌ నటించబోతోందని తెలుస్తోంది. అజిత్‌ ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమాతో బిజీగా ఉన్నారు.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *