బాబాయ్ , అబ్బాయ్ క‌లిసి రీమేక్

Rana Daggubati and Venkatesh Stills
Spread the love

మాధవన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా తమిళంలో తెరకెక్కిన ‘విక్రమ్‌ వేధా’ సినిమా ఇటీవల విడుదలై బాక్ల్‌బస్టర్‌ హిట్‌ దిశగా సాగుతోంది. ఇటు దేశంలోనూ, అటు విదేశాల్లోనూ భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా తెలుగులోకి రీమేక్‌ కానుంది. ‘రానా దగ్గుబాటి, వెంకటేష్‌తో ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు చర్చలు ప్రారంభించాం. ‘విక్రమ్‌ వేధా’ సినిమా విడుదలకు ముందే రీమేక్‌లో వారిని ఫస్ట్ చాయిస్‌గా భావించాం. అయితే, ఇంకా ఏది ఫైనలైజ్‌ కాలేదు. ఈ ప్రక్రియకు మరికొన్ని నెలల సమయం పట్టవచ్చు’ అని చిత్రవర్గాలు తెలిపారు.

పుష్కర్‌ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. గతవారం విడుదలైన ఈ సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. విక్రమ్‌ భేతాళ్‌ జానపద కథల స్ఫూర్తితో పోలీసు-గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమాలో మాధవన్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటించగా.. విజయ్‌ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు.


Related News

ileana-759

ఇల్లూ బేబీ పెళ్లి…

Spread the loveగోవా బ్యూటీ ఇలియానా రహస్యంగా పెళ్లిచేసేసుకుందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇలియానా.. ఆస్ట్రేలియాకి చెందిన ఫొటోగ్రాఫర్‌Read More

kotla suryaprakash

జగన్ గూటికి కోట్ల: ముహూర్తం సిద్ధం

Spread the loveకర్నూలు ఎంపీ సీటుపై క్లారిటీ రావడంతో మాజీ కేంద్ర మంత్రి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికేRead More

 • యాత్రను అడ్డుకుంటే జగన్ కే మేలు!
 • కొత్త అవతారంలో హీరో
 • 60ఏళ్ల నటుడితో నమిత ప్రేమాయణం
 • పీకల్లోతు ప్రేమలో రాయ్ లక్ష్మీ
 • తాప్సీ రెండో ఇల్లు..
 • డేటింగ్ కి సై అంటున్న బ్యూటీ
 • అజ్ఞాతవాసిగా మారాలనుకుంటున్న పవర్‌స్టార్‌..!
 • భారతీయుడు సీక్వెల్ సిద్ధం..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *