Main Menu

వ‌ల్ల‌భ‌నేని వంశీ రెడీ టూ జంప్..!

Spread the love

మ‌ళ్లీ క‌ల‌క‌లం రేగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఓసారి విజ‌య‌వాడ‌లో నేరుగా జ‌గ‌న్ ని క‌లిసి క‌ల‌క‌లం రేపిన వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నారు. టీడీపీ త‌రుపున బ‌రిలో దిగి త‌న చిర‌కాల వాంఛ ఎమ్మెల్యే హోదా ద‌క్కించుకున్నారు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. ఈసారి టీడీపీతో ఆయ‌న తెగ‌తెంపులు ఖాయ‌మ‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఒకటి రెండు రోజుల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్య‌వ‌హారంలో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. చంద్ర‌బాబు తీరుతో ఆయ‌న గుర్రుగా ఉన్న‌ట్టు చెబుతున్నారు. గ‌న్న‌వ‌రం లో త‌న‌కు పూర్తిగా ప‌ట్టు ఉన్న‌ప్ప‌టికీ ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు త‌న మాట‌ను ఖాత‌రు చేయ‌క‌పోవ‌డంతో వంశీ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు. దాంతో వైసీపీ ఆఫ‌ర్ ని అందిపుచ్చుకుని బాబుకి షాక్ ఇచ్చే యోచ‌న‌లో ఉన్న‌ట్టు చెబుతున్నారు.

వాస్త‌వానికి వ‌ల్ల‌భ‌నేని వంశీ కి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో చిర‌కాల స్నేహం ఉంది. అయినా గ‌డిచిన ఎన్నిక‌ల్లో చెరో దారిలో న‌డిచారు. చివ‌ర‌కు ఇద్ద‌రూ గెలిచారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒకే గూటిలో క‌ల‌వాల‌ని ఆశిస్తున్న‌ట్టుగా సాగుతున్న ప్ర‌చారం కృష్ణా జిల్లా టీడీపీలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. ఇప్ప‌టికే దాస‌రి జై రమేష్ వంటి క‌మ్మ సామాజిక‌వ‌ర్గ నేత‌లు టీడీపీకి గుడ్ బై చెప్పిన త‌రుణంలో గ‌న్న‌వ‌రంలో వంశీ చేజారిపోతే పెద్ద ప్ర‌భావం త‌ప్ప‌ద‌ని అంచ‌నాలు వేస్తున్నారు.

వంశీని శాంతింప‌జేసేందుకు కొంద‌రు కీల‌క నేత‌లు రంగంలో దిగిన‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో టీడీపీలో ఉన్నంత కాలం త‌న‌కు అమాత్య హోదా అవ‌కాశం ఉంద‌డ‌ని, వైసీపీలో త‌న‌కు గానీ, మిత్రుడు కొడాలి నాని కి గానీ బెర్త్ ఖాయ‌మ‌ని వంశీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏమ‌యినా ఈ ప‌రిణామాలు ఇప్పుడు బెజ‌వాడ‌లో మ‌రింత వేడి రాజేస్తుండ‌డం విశేసం.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the love3Sharesరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the love1Shareబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *