క‌నిపెడితే అన్నీ ఇచ్చేస్తానంటున్న త్రిష‌

Trisha-New-Stills-at-NAC-Store-Launch-010
Spread the love

కనిపెడితే బహుమతి అంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది హీరోయిన్‌ త్రిష. సంచలన హీరోయిన్లలో త్రిష ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకుముందు కమర్శియల్‌ చిత్రాల్లో గ్లామర్‌ కథానాయకిగా రాణించిన ఈ చెన్నై చిన్నది తాజాగా కథలో సెంట్రిక్‌ పాత్రలకు మారింది. ఆ తరహాలో మోహినీ, గర్జన్‌ వంటి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అదే విధంగా విజయ్‌సేతుపతితో 96 చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. సినిమా విషయాలను పక్కన పెడితే వ్యక్తిగతంగా త్రిష శునకాల ప్రేమికురాలన్న విషయం తెలిసిందే.

ఆ మధ్య పెటా సంస్థకు ఆదరణ తెలిపి ఆ తరువాత జల్లికట్టు పోరాట సమయంలో వారి ఆగ్రహానికి గురైన త్రిష తన ట్విట్టర్‌ను నిలిపేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆ సమస్య సద్ధుమణగడంతో మళ్లీ ట్విట్టర్‌ను రీ ఓపెన్‌ చేసిన త్రిష తాజాగా ఒక సంచల ప్రకటన చేసింది. అందులో కుక్క కనిపించడం లేదు. కనిపెట్టి అప్పగించగలరు అనే ప్రకటన అందర్నీ ఆకర్షిస్తోంది. అందుకు కారణం లేక పోలేదు. ఆ ప్రకటనలో కుక్క ఫొటోను ప్రచురించడంతో దాని పేరు లుక్‌ అని, ఆ కుక్క సమాచారాన్ని అందించిన వారికి అన్ని రకాల బహుమతులు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా రూ. 30 వేల నగదు బహుమతి ఉంటుందని త్రిష వెల్లడించింది. ఇంతకీ కనిపించకుండా పోయిన ఆ శునకం తనదా? వేరే ఎవరి కుక్క బాధ్యతలను తనపై వేసుకుందా అన్న విషయంలో త్రిష క్లారిటీ ఇవ్వలేదు.


Related News

Pawan-Kalyan

పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Spread the loveప్రస్తుతం పోర్న్ స్టార్ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే సన్నీలియోన్ బాలీవుడ్ లో పాగా వేసింది. తాజాగా రామ్Read More

anushka

ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క

Spread the loveరెబల్ స్టార్ ప్రభాస్, జేజమ్మ అనుష్క మధ్య వ్యవహారాలు రోజురోజుకి ఆసక్తిగా మారుతున్నాయి. వారి సాన్నిహిత్యం మరింతRead More

 • నిత్యామీనన్ లిప్ లాక్ ఎవరితో తెలుసా
 • తల్లి అవుతున్న కాజల్
 • ఉమ్మడి ప్రయోజనాల కోసమే కేసీఆర్, పవన్ భేటీ
 • హీరోయిన్ దొరికిపోయింది…
 • హీరోగారమ్మాయి డేటింగ్ వ్యవహారం..
 • కన్నతల్లిని ఖాతరు చేయని శ్రుతి హాసన్?
 • కొత్త రూపంలో బన్నీ
 • రేసు నుంచి రవితేజ అవుట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *