బాబు, లోకేష్, ప‌వ‌న్ వెన‌క‌డుగు ఎందుకు?

pawan lokesh chandrababu
Spread the love

నంద్యాల ఎన్నిక‌లు భ‌విష్య‌త్తుకి మార్గ‌ద‌ర్శ‌నం అనే మాట వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు ఎలా స్పందిస్తారో చెప్ప‌డానికి ఇదో సెమీ ఫైన‌ల్ గా భావిస్తున్నారు. పేరుకి ఉప ఎన్నిక‌లే అయినా సాధార‌ణ ఎన్నిక‌ల‌ను మించి పొలిటిక‌ల్ హీట్ రాజేస్తున్నాయి. ఏకంగా అపోజిష‌న్ లీడ‌ర్ ప‌దిహేను రోజులు ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేయ‌డ‌మే ఆశ్చ‌ర్యం. అయితే స‌హ‌జంగా అధికార‌ప‌క్షానికి , అందులోనూ ఆపార్టీ త‌రుపున ఉన్న నాయ‌కుడు చ‌నిపోయిన త‌ర్వాత వ‌స్తున్న ఎన్నిక‌ల్లో అడ్వాంటేజ్ ఉండాల్సి ఉంది. కానీ నంద్యాల‌లో సీన్ దానికి భిన్నంగా క‌నిపిస్తోంది. విప‌క్షం దూకుడు ముందు పాల‌క‌పార్టీ బేజారెత్తిపోతోంది.

ఈ నేప‌థ్యంలో ప‌లు స‌ర్వేల‌ను గ‌మ‌నిస్తే చంద్ర‌బాబుకి మింగుడుప‌డ‌ని వాస్త‌వాలు వెల్ల‌డ‌వుతున్న‌ట్టు భావిస్తున్నారు. నోటిఫికేష‌న్ రాక‌ముందు అప్ డేట్ ఏపీ నిర్వ‌హించిన స‌ర్వేలో కూడా టీడీపీ వెనుక‌బ‌డి ఉంది. ఇక ఇప్పుడు ప‌రిణామాలు ఎలా మారాయ‌న్న‌ది గ‌మ‌నార్హమే. కానీ స‌ర్వేలో సిగ్న‌ల్స్ అన‌నుకూలంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దాంతోనే చంద్ర‌బాబు వెన‌క‌డు వేశార‌ని అంటున్నారు. నంద్యాల ప్ర‌చారానికి నోటిఫికేష‌న్ రాక‌ముందే మూడు నాలుగు సార్లు వెళ్లి వ‌చ్చినా ఇప్పుడు మాత్రం ఆయ‌న దూరంగా ఉండడం విశేష‌మే. కేవ‌లం రోజూ అమ‌రావ‌తి నుంచి ప‌రిస్థితిని అంచ‌నాలేయ‌డం, సూచ‌న‌లివ్వ‌డం మిన‌హా ఆయ‌న నేరుగా భాగ‌స్వామి కావ‌డం లేదు. ఫ‌లితాలు తేడా వ‌స్తే ఆత‌ర్వాత ఆ ప్ర‌భావం త‌న‌మీద‌కు రాకుండా చూసుకోవాల‌న్న ల‌క్ష్యంలో ఉన్నారా అన్న అనుమానానికి ఈ ప‌రిణామా ఆస్కార‌మిస్తోంది.

చంద్ర‌బాబు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ చిన‌బాబు చాలాదూరంగా ఉండ‌డం కూడా ఆశ్చ‌ర్య‌మే. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానూ, స‌హ‌చ‌ర మంత్రికి అండ‌గా ఉండాల్సిన నారా లోకేష్ గ‌త కొన్ని రోజులుగా తెర‌మ‌రుగ‌య్యారు. ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలంటూ మీడియాలో హ‌డావిడి చేసి ఆ త‌ర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక వారిద్ద‌రికి బ‌దులుగా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ప్ర‌చారంలో దింపుతున్నార‌ని ప్ర‌చారం చేసినా ఇప్పుడు సందిగ్ధంలో ఉన్న‌ట్టు స‌మాచారం. బాల‌య్య ప్ర‌చారంలోకి దిగుతారా లేదా అన్న‌ది టీడీపీ వ‌ర్గాల్లో స్ప‌ష్ట‌త క‌నిపించ‌డం లేదు. దానికి కార‌ణం ప్ర‌చారానికి వ‌స్తారిన ఆశించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్నారు. ఆయ‌న కూడా స‌ర్వేలను చూసిన త‌ర్వాత అవ‌న‌స‌రంగా చేతులు కాల్చుకోవ‌డానికి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు భావిస్తున్నారు. అందుకే తాను రెండు రోజుల్లో త‌న పార్టీ వైఖ‌రి ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఎటువంటి స్ప‌ష్ట‌త లేకుండా సైలెంట్ అయిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. బాబు కోసం తెగిస్తే త‌న‌కే న‌ష్టం వ‌స్తుంద‌ని భావించిన ప‌వ‌న్ ప్ర‌చార‌మే కాకుండా క‌నీసం మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించే అవ‌కాశం లేద‌న్న‌ది తాజా అంచ‌నా.

మొత్తంగా జ‌గ‌న్ సుడిగాలి ప‌ర్య‌టిస్తున్నారు. ర‌ణ‌రంగంలో చెల‌రేగుతున్న‌ట్టుగా ఉంది. కానీ ఇత‌ర ప్ర‌ధాన నేత‌లు మాత్రం దూరంగా ఉన్నారు. బ‌రిలో దిగి తాడోపేడో తేల్చుకుంటార‌ని ఆశిస్తే దానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు తెలుగుత‌మ్ముళ్ల ఆశ‌ల‌ను నీరుగార్చేస్తున్నారు. దాంతో నంద్యాల‌లో టీడీపీ శ్రేణులు నిరుత్సాహ‌ప‌డుతున్నాయి.మ‌రి ఎన్నిక‌ల చివ‌రి ద‌శ‌లోన‌యినా బాబు ముందుకొస్తారో లేదో చూడాలి.


Related News

Mass-Maharaja-Ravi-Teja-new-film-titled-Nela-Ticket

నేలటికెట్ లో చిరంజీవి మువీ

Spread the loveఆశ్చర్యకరమే అయినా ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్ అవుతోంది. రవితేజ లేటెస్ట్ మువీ నేలటికెట్ సినిమాలో పలుRead More

apcabinet

మంత్రులు మారిపోతున్నారు..!

Spread the loveఏపీలో క్యాబినెట్ లో పలువురు మంత్రులు మారబోతున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా సీఎం కసరత్తు కూడా ప్రారంభించినట్టుRead More

 • చిరుతో శివ!
 • చంద్రబాబుకి సన్నిహితుడి షాక్
 • ఏపీ ఎన్నికలపై ఆసక్తికర సర్వే
 • పునరాలోచనలో పురందేశ్వరి!
 • వైసీపీతో మంత్రి మంత‌నాలు?
 • అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్న వైసీపీ!
 • శ్రీరెడ్డికి భారీ ఛాన్స్
 • ప‌వ‌న్ ఎఫెక్ట్: బాబు స‌న్నిహితుడిపై వేటు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *