ఆ ఎమ్మెల్సీల చూపు వైసీపీ వైపు..!

ysrcp-party-flag-647x450
Spread the love

కాలం క‌లిసిరాన‌ప్పుడు తాడే పామై క‌రుస్తుంద‌న్న‌ది నానుడి. ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి దానికి తగ్గ‌ట్టుగా ఉంది. రాష్ట్రం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని ఆయ‌న చెప్పుకుంటున్నా ఫ‌లితం మాత్రం క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు ఎంతగానే ఆశ‌లు పెట్టుకున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను కూడా ఆయ‌న సాధించ‌లేక‌పోయారు. దాని ప్ర‌భావం అన్ని చోట్లా క‌నిపిస్తోంది. ప‌లువురు టీడీపీ నేత‌లు త‌మ దారి తాము చూసుకోవ‌డానికి కార‌ణం అవుతోంది.

ఆ క్ర‌మంలోనే ఇన్నాళ్లుగా ఓపిక‌తో ఉన్న ప‌లువురు సీనియ‌ర్లు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులోనూ చంద్ర‌బాబు ప‌ద‌వి ఇచ్చిన త‌ర్వాత ప‌క్క‌చూపులు చూస్తున్నారు. దాంతో టీడీపీ పెద్ద‌ల్లో ఎటూ పాలుపోవ‌డం లేదు. అదే స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ శిబిరం వైపు చూస్తున్న వారు కూడా త‌మ ఎమ్మెల్సీ సీటు వ‌దులుకోవాల్సి వ‌స్తుందా అన్న ఆందోళ‌న‌లో ఉన్నారు. దాంతోనే కాల‌యాప‌న చేయాల్సి వ‌స్తోంద‌ని స‌మాచారం.

తాజాగా అద్దంకి ప‌రిణామాల త‌ర్వాత క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మార‌క త‌ప్పేలా లేదు. గొట్టిపాటి ర‌వికుమార్ దే అద్దంకి అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసేయ‌డం, ఎమ్మెల్సీ ప‌ద‌వితో క‌ర‌ణం కుటుంబం స‌ర్థుకోవాలని చెప్పేయ‌డంతో ఇక వెంక‌టేష్ కి రాజ‌యోగం ద‌క్కాలంటే మ‌రో పార్టీ చూసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. అందుకే ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో ట‌చ్ లోకి వెళ్ళారు. పార్టీ మార‌డానికి సంసిద్ధ‌త కూడా వ్య‌క్తం చేశారు. కానీ రాక‌రాక వ‌చ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌న్న సందేహంతో ఆయ‌న మ‌రికొంత ఆగాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌మ్మ‌ల‌మ‌డుగు రామ‌సుబ్బారెడ్డిది కూడా అదే ప‌రిస్థితి. త‌న‌కు ప‌ద‌వి ద‌క్కింద‌న్న సంతోషం క‌న్నా, త‌న ప్ర‌త్య‌ర్థి త‌న‌పై స్థానంలో ఉన్నార‌న్న విష‌య‌మే రామ‌సుబ్బారెడ్డి కుటుంబీకుల‌కు, అనుచ‌రుల‌కు మింగుడుప‌డ‌డం లేదు. దాంతో ఆయన‌కు కూడా మ‌రో దారి ప‌ట్ట‌క త‌ప్ప‌డం లేదు. దాంతో రామ‌సుబ్బారెడ్డి అనుచ‌రులు కూడా వైసీపీ నేత‌ల‌తో సంబంధాలు నెరుపుతున్నారు. కానీ అదే స‌మ‌యంలో సుదీర్ఘ‌విరామం త‌ర్వాత ద‌క్కిన ఎమ్మెల్సీ ప‌ద‌వి విష‌యంలో ఏం చేయాలో ఆయ‌న‌కు కూడా పాలుపోవ‌డం లేద‌ని స‌మాచారం. ఇలాంటి అనేక అడ్డంకులుండ‌డంతోనే కొంద‌రు ఆలోచిస్తున్నారని, లేకుంటే ఇప్ప‌టికే కొంద‌రు జెండా మార్చేసే వార‌నే వాద‌న ఉంది. అలాంటి వారి జాబితాలో మాగంటి శ్రీనివాసుల రెడ్డి పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ఆయ‌న కూడా వైసీపీ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆ విష‌యంలో క్లారిటీ వ‌చ్చేస్తే ఎమ్మెల్సీ వ‌దులుకోవ‌డానికి పెద్ద‌గా అభ్యంత‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం.

ఇక స‌స్ఫెండెడ్ ఎమ్మెల్సీలిద్ద‌రూ వాకాటి నారాయ‌ణ‌రెడ్డి, దీప‌క్ రెడ్డి కూడా బాబు తీరు మీద ఆగ్ర‌హంతో ఉన్నారు. వారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మొత్తంగా పెద్ద‌ల స‌భ‌లో ప‌లువురు ప‌క్క‌చూపులు చూస్తున్నార‌న్న విష‌యం తెలిసిన టీడీపీ పెద్ద‌లు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. ఫ‌లితాలు ఎలా ఉంటాయో కాలమే స‌మాధానం చెప్పాలి.


Related News

Rangasthalam_5745

రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..

Spread the loveమెగా ప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మువీ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది. వ‌చ్చే వారిRead More

janasena pawan kalyan

ప‌వ‌న్ త‌డ‌బాటు..

Spread the loveజ‌న‌సేనాని త‌డ‌బ‌డుతున్నారు. త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ రాజ‌కీయంగా కొంత గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. దాంతో ప‌వ‌న్ తీరు చాలామందినిRead More

 • బాల‌య్య హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది..
 • ముంద‌స్తు ముప్పు త‌ప్పంది…!
 • రాజ‌కీయాల్లో కీల‌కం కాబోతున్న హీరోయిన్
 • రాజ్య‌స‌భ కోసం బీజేపీకి వైసీపీ తాయిలాలు…!
 • మంత్రి ప‌దవుల కోసం మొద‌ల‌యిన లాబీయింగ్
 • వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మేనా?
 • ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్
 • హాట్ ల‌వ‌ర్స్ బ్రేక‌ప్..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *