Main Menu

ఎన్నిక‌ల గుర్తుల‌పై దుమారం!

Spread the love

ఏపీ రాజ‌కీయాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర విచిత్రంగా పోరుగా సాగుతోంది. ప్ర‌త్య‌ర్థుల శిబిరంలో గంద‌ర‌గోళం సృష్టించే ప్ర‌య‌త్నాలు పెద్ద స్థాయిలో సాగుతున్నాయి. ఈసారి ఏకంగా ఎన్న‌కల గుర్తులే ల‌క్ష్యంగా సాగుతున్న ట్రోలింగ్ క్యాంపెయిన్ విస్మ‌య‌క‌రంగా సాగుతోంది.

తాజాగా వైసీపీ ఇప్ప‌టికే ఈసీకి ప‌లు ఫిర్యాదులు చేసింది. ముఖ్యంగా హెలికాప్ట‌ర్ గుర్తు కేటాయించ‌డాన్ని నిర‌సిస్తోంది. అది ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తోంది. అదే స‌మ‌యంలో వైసీపీ ఎన్నిక‌ల గుర్తు మారిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ఊపందుకుంది.జ‌గ‌న్ త‌న గుర్తు మార్చేసి ఏకంగా హెలీకాప్ట‌ర్ గుర్తుపై పోటీ చేస్తున్నారంటూ కొంద‌రు పోస్టింగ్స్ ప్రారంభించారు. ప్ర‌స్తుతం అవి వైర‌ల్ అవుతున్నాయి. ఫ్యాన్, హెలీకాప్ట‌ర్ ఒకే పోలిక‌లో ఉండ‌డం, ఇప్పుడు గుర్తులు మారిపోయాయంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డం విచిత్రంగా సాగుతోంది. ఈ ప్ర‌చారాన్ని వైసీపీ తీవ్రంగా నిర‌సిస్తోంది.

అందుకు పోటీగా వైసీపీ శ్రేణులు కూడా జ‌న‌సేన మీద ఎదురుదాడికి దిగారు. జ‌న‌సేన గుర్తు మారిపోయిందంటూ ప్ర‌చారం ప్రారంభించారు. గాజుగ్లాస్ గుర్తు ర‌ద్దు చేసుకున్నారంటూ ట్రోలింగ్ మొద‌లుపెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. దాంతో జ‌న‌సేన పార్టీ అధికారికంగా దానిని ఖండించాల్సివ‌చ్చింది. ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సందేశం వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని భావించి తాము వివ‌ర‌ణ ఇస్తున్నామ‌ని, ఇలాంటి దుష్ప్ర‌చారాలు చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌న‌సేన కోరుతోంది.

ఇక ఈ క్యాంపెయిన్ లో టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు కూడా భాగ‌స్వాముల‌వుతున్నారు. ఇరు పార్టీల‌ను బ‌ద్నాం చేసేందుకు వినియోగించుకుంటున్నారు. దాంతో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతున్న ఇలాంటి ప్ర‌చారాలు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి.






Related News

ప్రేమ- పెళ్లి- విడాకులు- మ‌ళ్లీ పెళ్లి

Spread the loveకొంతకాలం కిందట అధికారికంగా విడిపోయిన మలైకా ఆరోరా- అర్బాజ్ ఖాన్ లు ఇప్పుడు మళ్లీ పెళ్లికి రెడీRead More

సీనియ‌ర్ నేత‌పై జ‌గ‌న్ సీరియ‌స్..!

Spread the loveవైసీపీ నేత‌ల తీరు అధిష్టానానికి ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ముఖ్యంగా కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల వ్య‌వ‌హారం జ‌గ‌న్ కిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *