Main Menu

శ్రియ పెళ్లికూతురవుతోంది..

Spread the love

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో శ్రియ ఒకరు. గడిచిన దశాబ్దంన్నరగా పలువురుతో ఆడిపాడి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. అటు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించింది. అయితే చాలాకాలంగా శ్రియ పెళ్లి చుట్టూ రకరకాల వార్తలు వస్తున్నాయి. మధ్యలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోతో ఓ క్లబ్ ముందు ఫోటోలకు చిక్కడంతో వారి వ్యవహారం చుట్టూ చర్చ సాగింది.

కానీ చివరకు ఇప్పుడు ఓ రష్యన్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోందనే వార్త సంచలనంగా మారింది. సినీ వర్గాల్లో ఇదో హాట్ టాపిక్ అయ్యింది. ఆ యువకుని కుటుంబసభ్యులతో పెళ్లి విషయంపై శ్రియ కుటుంబం మాట్లాడిందని భోగట్టా. పెళ్లికి రెండు కుటుంబాలూ సమ్మతం తెలిపాయని సమాచారం. మార్చిలో వీరి వివాహం రాజస్థాన్‌లో జరగనుందని టాక్‌. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వివాహం సింపుల్‌గా జరపాలని ప్లాన్‌ చేస్తున్నారట.






Related News

నంద్యాలపై నారా లోకేష్ క‌న్ను!

Spread the loveకర్నూలు జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. నంద్యాల నియోజకవర్గం నుండి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ పోటీచేస్తారనే ప్రచారంRead More

బాబు మీద గురిపెట్టి ఏపీకి మ‌ళ్లీ అన్యాయం..!

Spread the loveరాక రాక వ‌చ్చారు. కానీ ఏదో చేస్తార‌ని ఆశించిన వాళ్ల‌ను నిరాశ‌లో ముంచారు. ఏదో ఒక హామీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *