Main Menu

నంద్యాల టీడీపీకి షాక్: వైసీపీలోకి ఎమ్మెల్సీ?

shilpa brothers
Spread the love

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో రాజ‌కీయాలు కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. ప‌లువురు నేత‌లు వైసీపీ వైపు క్యూ క‌డుతుండ‌డంతో టీడీపీ ఉక్కిరిబిక్కిర‌వుతోంది. నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఇటీవ‌ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే త‌న‌యుల‌తో క‌లిసి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా మునిసిప‌ల్ కౌన్సిల‌ర్ గోడ‌దూకేశారు. ఇక ఈనెల 3న జ‌గ‌న్ ప‌ర్య‌ట‌నలో వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి ఎమ్మెల్సీ సిద్ధ‌ప‌డుతున్నార‌నే వార్త‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. తెలుగుదేశం నేత‌ల్లో గంద‌ర‌గోళం పెంచుతున్నాయి.

శిల్పా బ్ర‌ద‌ర్స్ విడ‌దీయ‌లేనిది. సుదీర్ఘ‌కాలంగా క‌లిసే సాగారు. కానీ కొద్దిరోజుల క్రితం శిల్పా మోహ‌న్ రెడ్డి వైసీపీలో చేరిన‌ప్ప‌టికీ శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి మాత్రం తాను టీడీపీలోనేన‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మూడు నెల‌ల క్రిత‌మే జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల కోటాలో వైసీపీ అభ్య‌ర్థి గౌరు వెంక‌ట‌రెడ్డిని ఆయ‌న ఓడించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆత‌ర్వాత ఆయ‌న మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విని ఆశించారు. దానికోసం శిల్పా చ‌క్ర‌పాణి ఎదురుచూస్తున్నారు. కానీ తాజా ప‌రిణామాల‌తో శిల్పా చ‌క్ర‌పాణికి అలాంటి అవ‌కాశం లేద‌ని తేల‌డంతో ఆయ‌న త‌న‌దారి తాను చూసుకునే ప‌నిలో ప‌డ్డార‌ని ప్ర‌చారం సాగుతోంది.

అదే స‌మ‌యంలో శిల్పా మోహ‌న్ రెడ్డి కూడా త‌న త‌మ్ముడిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్టు స‌మాచారం. శ్రీశైలం ఇన్ఛార్జ్ గా ఉన్న‌ప్ప‌టికీ శిల్పా చ‌క్ర‌పాణి గ‌డిచిన కొన్ని రోజులుగా నంద్యాల వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటున్నారు. మ‌ధ్య‌లో విదేశాల‌కు కూడా వెళ్లి వ‌చ్చారు. అయినా శిల్పా మోహ‌న్ రెడ్డి మాత్రం ప‌ట్టువీడ‌క‌పోవ‌డంతో అన్న బాట‌లో చ‌క్ర‌పాణి సాగ‌డం ఖాయంగా మారింది. దాంతో శిల్పా చ‌క్ర‌ఫాణి టీడీపీ వీడిపోయే అవ‌కాశాలున్నాయంటున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో మోహ‌న్ రెడ్డికి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించ‌డానికి రంగం సిద్ధ‌మ‌య్యిందంటున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే శిల్పా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య చ‌ర్చ‌లు సాగుతున్నాయి. అవి ఫ‌ల‌ప్ర‌దం అయితే 3వ‌తేదీన జ‌గ‌న్ బ‌హిరంగ‌స‌భ‌లో శిల్పా చ‌క్ర‌పాణి పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని వారి అనుచ‌రులు చెబుతున్నారు. దాంతో చ‌క్ర‌పాణిని నిలువ‌రించ‌డానికి టీడీపీ నేత‌లు రంగంలో దిగారు. ఆయ‌న్ని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు సాగుతున్న ట్టు తెలుస్తోంది. మ‌రి అన్న‌య్య ఒత్తిడికి త‌లొగ్గుతారా లేక టీడీపీ ఆఫ‌ర్ల‌తో స‌రిపెట్టుకుంటారా అన్న‌ది చ‌క్ర‌పాణి చేతుల్లో ఉందిఏ. మొత్తంగా ఏం జ‌రిగినా నంద్యాల ఎన్నిక‌ల్లో ప‌లుమార్పులు ఖాయం.


Related News

sunitha

రేణూ దేశాయ్ బాట‌లో సింగ‌ర్ సునీత‌

Spread the loveప్ర‌స్తుతం టాలీవుడ్ లో పున‌ర్వివాహాల సీజ‌న్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు రెండో పెళ్లిళ్ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.Read More

Actor-Vishal-Krishna-Photo-Gallery-0gybl07

శ్రీరెడ్డికి విశాల్ ఝ‌ల‌క్

Spread the loveకోలీవుడ్ స్టార్, హీరో విశాల్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో ఆయ‌న సీరియ‌స్ గాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *