Main Menu

స్వ‌రం మార్చేస్తున్న స‌మంత‌

Spread the love

అక్కినేని స‌మంత స్వ‌రం మార్చేస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి ఆమె వినిపించిన గొంతు ఇక‌పై విన‌బ‌డ‌దు. దానికి ప్ర‌ధాన కార‌ణం స‌మంత స్వ‌యంగా డ‌బ్బింగ్ కి సిద్ధ‌ప‌డుతుండ‌డ‌మే. ఇన్నాళ్లుగా స‌మంత క్యారెక్ట‌ర్ లో చిన్మ‌యి స్వ‌రం వినిపించేది. కానీ ఇక నుంచి సొంతంగా డ‌బ్బింగ్ సిద్ధ‌ప‌డుతున్న స‌మంత మూలంగా అలాంటి అవ‌కాశం ఉండ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు.

మ‌హాన‌టి సినిమా ద్వారా స‌మంత స్వ‌యంగా తెలుగులో డ‌బ్బింగ్ కి సిద్ధ‌ప‌డుతోంది. వాస్త‌వానికి కొన్నాళ్లుగా తెలుగులో బాగానే మాట్లాడుతున్న‌ప్ప‌టికీ చిన్మ‌యి స్వ‌రంతో స‌మంత‌ను అల‌వాటుప‌డిన ఫ్యాన్స్ కోసం కొన‌సాగించింది. ఇక మ‌హానటి ద్వారా మాత్రం సొంత గొంతు వినిపించాల‌నే ఉద్దేశంతో స్వ‌రం మార్పునుకు సిద్ధ‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌ధాన పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో ఉంది. ఈ వేస‌విలోనే సంద‌డి చేయ‌బోతున్న నేప‌థ్యంలో మ‌రో స‌క్సెస్ కోసం స‌మంత చూస్తోంది.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *