ఆ హీరోయిన్ పేరు చెప్పగానే బాబోయ్ అంటున్న హీరో

Premam-Heroine-Sai-Pallavi-Leaked-Images-from-Rain-Songs-in-Telugu-Movie-Fidaa-with-Varun-Tej
Spread the love

ప్రేమమ్ లో మలర్ పాత్రతో మళయాళంలో… ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగులో సాయి పల్లవి ప్రేక్షకులను మైమరపింపజేసింది. ఫిదాలో ఆమె నటనకు.. డైలాగ్ డెలివరీకి.. డ్యాన్సులకు మొత్తం తెలుగు వాళ్లంతా ఫిదా అయిపోయారు. అప్పటినుంచి ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడినా వాటిలో చాలావాటికి సీరియస్ గా నో చెప్పేసింది. ఆచితూచి చాలా సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తానని కచ్చితంగా చెప్పేసింది.

ఫిదా సినిమా విజయం వెనుక శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ ఎంతో ఉంది. కానీ అనుకోని విధంగా క్రెడిట్ మొత్తం సాయి పల్లవి అకౌంట్ లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా విజయం తలకెక్కడంతో ఇప్పుడు ఆమె ఎవరినీ కేర్ చేయడం లేదట. రీసెంట్ గా తన సహజ నటనతో పేరుతెచ్చుకున్న యంగ్ హీరోతో చేస్తున్న సినిమాలో అంతా తనిష్టం అన్నరీతిలో వ్యవహరించడంతో ఆ హీరో ఆమెపై చిరాకు పడిపోయాడట. షూటింగ్ కు లేటుగా రావడం.. అదేమని అసిస్టెంట్ డైరెక్టర్లు అడిగినా సమాధానం ఇవ్వకపోవడంతో చిత్ర యూనిట్ అవాక్కవ్వాల్సి వచ్చింది. దీనికితోడు ఆ హీరోతో సాయిపల్లవికి మాటామాటా తేడా వచ్చి.. చివరకు సెట్స్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయాడని టాక్.

ఈ గొడవలో తప్పెవరది అన్నదానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా సాయిపల్లవి తీరుపై మరికొన్ని విమర్శలు లేకపోలేదు. సాయిపల్లవి టాలెంటెడ్ యాక్టర్ అన్నది ప్రేమమ్ తోనే అందరికీ తెలిసింది. ఇండస్ట్రీలో రాణించడానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. అయినా ఒక్క సినిమాకు అంతా నా ఇష్టం అన్నట్టుంటే కష్టమని.. ఇది ఆమె కెరీర్ కు ఏమంత మంచిది కాదని టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్.


Related News

ileana-759

ఇల్లూ బేబీ పెళ్లి…

Spread the loveగోవా బ్యూటీ ఇలియానా రహస్యంగా పెళ్లిచేసేసుకుందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇలియానా.. ఆస్ట్రేలియాకి చెందిన ఫొటోగ్రాఫర్‌Read More

kotla suryaprakash

జగన్ గూటికి కోట్ల: ముహూర్తం సిద్ధం

Spread the loveకర్నూలు ఎంపీ సీటుపై క్లారిటీ రావడంతో మాజీ కేంద్ర మంత్రి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికేRead More

 • యాత్రను అడ్డుకుంటే జగన్ కే మేలు!
 • కొత్త అవతారంలో హీరో
 • 60ఏళ్ల నటుడితో నమిత ప్రేమాయణం
 • పీకల్లోతు ప్రేమలో రాయ్ లక్ష్మీ
 • తాప్సీ రెండో ఇల్లు..
 • డేటింగ్ కి సై అంటున్న బ్యూటీ
 • అజ్ఞాతవాసిగా మారాలనుకుంటున్న పవర్‌స్టార్‌..!
 • భారతీయుడు సీక్వెల్ సిద్ధం..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *