Main Menu

ప్ర‌మాదాలు: మొన్న ప‌వ‌న్, నేడు నాదెండ్ల‌

Spread the love

జ‌న‌సేన నేత‌ల చుట్టూ ఏం జ‌రుగుతోంది. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. వ‌రుస‌గా ఆపార్టీ నేత‌ల‌కు జ‌రుగుతున్న ప్ర‌మాదాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే వాటిని కొంద‌రు కొట్టి పారేస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం సందేహాలు సంపూర్ణంగా నివృత్తి కాక‌పోవ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌నే ఆందోళ‌న మాత్రం వెలిబుచ్చుతున్నారు.

గ‌డిచిన వారంలో తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాన్వాయ్ లో ప్రమాదం జ‌రిగింది. అప్ప‌ట్లో ప‌వ‌న్ సెక్యూరిటీ సిబ్బంది గాయ‌ప‌డ్డారు. ఓ లారీ దూసుకురావ‌డంతో రంగంపేట స‌మీపంలో జ‌రిగిన ప్ర‌మాదంలో కాన్వాయ్ వాహ‌నానికి ప్ర‌మాదం జ‌రిగింది. అయితే అది ప‌వ‌న్ ని టార్గెట్ చేసి ఉంటార‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే దానిని అత్య‌ధికులు కొట్టి పారేశారు. అలాంటి అనుమానాల‌కు ఆస్కారం లేదంటూ వ్యాఖ్యానించారు.

అయితే అది జ‌రిగిన నాలుగురోజుల‌కే మ‌రో ప్ర‌మాదం జ‌రగ‌డం మాత్రం అనుమానాల‌కు తావిస్తోంది. ఈసారి జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఈ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ వాహనాన్ని లారీ ఢీ కొట్ట‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ విష‌యంపై ద‌ర్యాప్తు చేయాల‌ని జూబ్లీహిల్స్ పీఎస్ లో నాదెండ్ల మనోహర్ డ్రైవర్ వెంకటేశ్వర రావు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు 336, 279 ఐపిసి కింద లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. దాంతో ఈ వ‌రుస ప్ర‌మాదాల పై జ‌న‌సేన నేత‌ల్లో అనుమానాలు మొద‌ల‌వుతుండ‌డం పెద్ద ఆశ్చ‌ర్యం కాద‌ని అంటున్నారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *