Main Menu

చంద్ర‌బాబు అస‌లు ల‌క్ష్యం అదే..!

Spread the love

ఏపీ సీఎం రూటు మార్చారు. చంద్ర‌బాబు దృష్టి హ‌స్తిన వైపై మళ్లింది. టీడీపీ అధినేత జాతీయ రాజ‌కీయాల‌పై కేంద్రీకరిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా వారం వ్య‌వ‌ధిలోనే రెండు మార్లు ఢిల్లీ వెళ్ల‌డం, వివిధ నేత‌ల‌తో భేటీ కావ‌డం, మీడియాతో మాట్లాడ‌డం జ‌రిగిపోయాయు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ తో చేతులు క‌లిపారు. వీణ ఇచ్చి రాహుల్ తో స్నేహం విస్త‌రిస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు. బీజేపీని ఓడించేందుకు పార్టీల‌న్నీ ఏక‌తాటిపైకి తీసుకురావ‌డానికి త‌న‌వంతు ఆత్ర పోషిస్తాన‌ని చెప్పిన‌ట్టుగానే దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌య‌త్నాల‌లో సాగుతున్నారు.

ఈ ప‌రిణామ‌ల ద్వారా చంద్ర‌బాబు రెండు సంకేత‌లు ఇస్తున్న‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ తో క‌లిస్తే ఉరి తీసుకుంటామ‌ని కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు తొలుత మాట్లాడినా ఇప్పుడు మౌనం వ‌హించ‌డం గ‌మ‌నిస్తే టీడీపీ నేత‌లు దాదాపుగా చంద్ర‌బాబు నిర్ణ‌యానికి అంగీక‌రించిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. అయితే చంద్ర‌బాబు మాత్రం త‌న భ‌విత‌వ్యం రీత్యానే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు అంచ‌నాలు వేస్తున్నారు. ఏపీలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తీవ్ర‌మ‌వుతున్న త‌రుణంలో ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆయ‌న హ‌స్తిన‌లో అధికారం కోసం అర్రులు చాస్తున్న‌ట్టు కొంద‌రు మాట్లాడుతుండ‌డం విశేషం. అమ‌రావ‌తిలో అటూఇటూ అయినప్ప‌టికీ హ‌స్తిన‌లో త‌న‌కు అనుకూలంగా ఉన్న నేత‌లు అధికారంలో ఉంటే ఏదో రీతిలో చక్రం తిప్పే చాన్స్ వ‌స్తుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు లెక్క‌లేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ముంద‌స్తుగా అడుగులేసి కాంగ్రెస్ ని కూడా క‌లుపుకోవ‌డం ద్వారా ఎన్నిక‌ల త‌ర్వాత అంద‌రినీ స‌మ‌న్వ‌య‌ప‌రిచే నేత‌గా ఎదిగేందుకు పావులు క‌దుపుతున్నార‌ని చెప్పుకొస్తున్నారు.

అదే స‌మ‌యంలో హ‌స్తినలో అధికార‌ప‌క్షం మీద సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు కార్పోరేట్ వర్గాల్లో కూడా పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌కు తాజా ప‌రిణామాలు ఆధారమ‌ని కొంద‌రు భావిస్తున్నారు. తాను ప‌క్కా కార్పోరేట్ సీఎంన‌ని, ఏకంగా సీఈవోన‌ని కూడా చెప్పుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు మోడీకి వ్య‌తిరేకంగా కూట‌మి కోసం అంద‌రినీ క‌లుపుకురావ‌డం, ఏకంగా కాంగ్రెస్ అధినేత ఇంటికి వెళ్ల‌డం గ‌మ‌నిస్తే మోడీ వ్య‌తిరేక కార్పోరేట్ లాబీయింగ్ సార‌ధిగా చంద్ర‌బాబు క‌నిపిస్తున్నార‌ని భావిస్తున్నారు. ఒక‌ప్పుడు ముంబై కేంద్రంగా శ‌ర‌ద్ ప‌వార్ అలాంటి ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం రీత్యా ఆ బాధ్య‌త‌ను చంద్ర‌బాబు మోస్తున్నార‌ని, గ‌తంలో కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా ప‌వార్, ఇప్పుడు మోడీకి వ్య‌తిరేకంగా క్యాంపుల‌న్నింటినీ క‌లిపే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేయ‌డం విశేషంగా చెబుతున్నారు. ఇది దేశ రాజ‌కీయాల్లో ఓ కీల‌కాంశంగా కూడా మార‌బోతున్న‌ట్టు చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌రిణామాల ఫ‌లితం చంద్ర‌బాబుకి ఏమేర‌కు ద‌క్కుతుందో చూడాల్సి ఉంది.


Related News

నంద్యాలపై నారా లోకేష్ క‌న్ను!

Spread the loveకర్నూలు జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. నంద్యాల నియోజకవర్గం నుండి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ పోటీచేస్తారనే ప్రచారంRead More

బాబు మీద గురిపెట్టి ఏపీకి మ‌ళ్లీ అన్యాయం..!

Spread the loveరాక రాక వ‌చ్చారు. కానీ ఏదో చేస్తార‌ని ఆశించిన వాళ్ల‌ను నిరాశ‌లో ముంచారు. ఏదో ఒక హామీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *