Main Menu

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the love

రవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచిన ఆయన త్వరలోనే మెగా ఫోన్‌ పట్టబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ఓ పవర్‌ ఫుల్‌ హై ఓల్టేజ్‌, ఎనర్జిటిక్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని రవితేజ తెరకెక్కించాలని భావిస్తున్నారట. దీని కోసమై ఇటీవల కళ్యాణ్‌రామ్‌కి రవితేజ కథ చెప్పినట్టు సమాచారం.

రవితేజ నెరేషన్‌కి కళ్యాణ్‌రామ్‌ ఫిదా అయ్యారని, తన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మల్లాది విశిష్ట దర్శకత్వంలో ‘అశ్వథామ’ పేరుతో ఓ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌ చిత్రాన్ని కళ్యాణ్‌ రామ్‌ చేయబోతున్నారనీ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, రవితేజ నటించబోయే తమిళ ‘థెరీ’ రీమేక్‌ చిత్రానికి ‘కనకదుర్గ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇందులో రవితేజకి జోడీగా కేథరిన్‌ నటించనుంది.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *