రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..

Rangasthalam_5745
Spread the love

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మువీ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది. వ‌చ్చే వారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఆస‌క్తి పెరుగుతోంది. అభిమానుల సంద‌డి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆడియో సాంగ్స్ కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ట్రైల‌ర్ కూడా ఆక‌ట్టుకుంది. డీఎస్పీ మ్యూజిక్ అంద‌రినీ మెప్పిస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కూడా గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో సినిమా యూనిట్ సంతోషంగా క‌నిపిస్తోంది. స‌మంత హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్, ఆది పినిశెట్టి, అనసూయ, జబర్దస్త్ శ్రీను, మహేష్ మొదలగు వారు ఇతర పాత్రలలో నటించారు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లీక‌య్యింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. సోష‌ల్ మీడియాలో స్టోరీ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న స్టోరీ ప్ర‌కారం ఇదో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ స్టోరీగా అర్థ‌మ‌వుతోంది. ‘‘చిట్టిబాబు (రామ్‌చరణ్), కుమార్ బాబు (ఆది పినిశెట్టి).. ఇద్దరూ అన్నద‌మ్ములు. రంగస్థలం ఊరి ప్రెసిడెంట్ జగపతి బాబు. అనుకోని పరిస్థితుల వల్ల కుమార్ బాబు ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తాడు. దీనితో జగపతి బాబు.. ఆది పినిశెట్టిని చంపేస్తాడు. తన అన్న చావుకి కారణమైన వారిని చరణ్ ఎలా తుదముట్టించాడనేదే సినిమా కథ’’ అంటూ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

దీనిని ప‌లువురు మెగా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. త‌న‌కు ఖైదీ మాదిరిగా చెర్రీకి రంగ‌స్థ‌లం అవుతుంద‌ని చిరంజీవి చెప్పిన పాయింట్ ఆధారంగా ఇలాంటి క‌థ అల్లేసి ఉంటార‌ని అభిమానులు చెబుతున్నారు. మ‌రి అస‌లు క‌థ ఏంట‌న్న‌ది తెలియాలంటే వ‌చ్చే వారం వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.


Related News

Vijayasai-Reddy

వైసీపీతో మంత్రి మంత‌నాలు?

Spread the loveఏపీలో ప‌లువురు ఎమ్మెల్యేలు మాతో ట‌చ్ లో ఉన్నార‌ని వైసీపీ ప్ర‌క‌టించింది. టీడీపీ ఎంపీలు త‌మ‌వైపు రావ‌డానికిRead More

jagan ys

అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్న వైసీపీ!

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీకి అభ్య‌ర్థులు కావాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త నేత‌లు అత్య‌వ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టుగా వేటRead More

 • శ్రీరెడ్డికి భారీ ఛాన్స్
 • ప‌వ‌న్ ఎఫెక్ట్: బాబు స‌న్నిహితుడిపై వేటు?
 • స్వ‌రం మార్చేస్తున్న స‌మంత‌
 • సుకుమార్ రంగ‌స్థ‌లానికి కులం రంగులు…
 • క‌ర్ణాట‌క బ‌రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
 • జ‌న‌సేన‌లో తొలి వికెట్ ప‌డిందా..?
 • జేడీ మ‌రో జేపీ అవుతారా..?
 • రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *