Main Menu

తారక్, చెర్రీ మువీకి తార ఆమె..

Spread the love

టాలీవుడ్‌లో లేటెస్ట్ హాట్ టాపిక్ రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీయార్ కాంబినేషన్ లో వస్తున్న మువీనే. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా కావడంతో దానికి క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తొలిసారిగా తీయ‌బోతున్న మ‌ల్టీస్టార‌ర్ సినిమా కావడం మరోవిశేషంగా మారింది. కుటుంబ క‌థా నేప‌థ్యంతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో చెర్రీ, తార‌క్ బాక్స‌ర్లుగా క‌నిపించ‌బోతున్నార‌ని గ్యాసిప్‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా మరో వార్త హల్ చల్ చేసింది. ఈ సినిమా హీరోయిన్ చుట్టూ సాగుతున్న చర్చలు చివరకు అనూ ఇమ్మాన్యేల్ చుట్టూ తిరుగుతున్నాయని సమాచారం. `మ‌జ్ను` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అను.. స్వ‌ల్ప కాలంలోనే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అల్లు అర్జున్ వంటి అగ్ర‌ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్కించుకుంది. త్రివిక్ర‌మ్‌, ఎన్టీయార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న సినిమాలో కూడా అనుయే హీరోయిన్‌గా ఎంపికైంద‌ని స‌మాచారం. టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న రాజ‌మౌళి సినిమాలో కూడా హీరోయిన్ చాన్స్ ద‌క్క‌డం నిజ‌మైతే అను కెరీర్ ఒక్కసారిగా ఎక్క‌డికో వెళ్లిపోతుందని చెప్పక తప్పదు. మొత్తంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ తో కలిసి, మెగా దర్శకుడితో అవకాశం వస్తే అమ్మడి రేంజ్ అమాతంగా పెరుగుతుందనడంలో సందేహం లేదు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *