Main Menu

ర‌కుల్ పై పెళ్లి ఒత్తిడి

Spread the love

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించి ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత రకుల్ నటించిన తెలుగు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో రకుల్‌కి టెన్షన్ పట్టుకుంది. దీంతో చెన్నై చెక్కేసిన రకుల్ కోలీవుడ్‌లో రెండుమూడు చిత్రాల్లో నటిస్తోంది. ఇక కార్తీతో నటించిన ఖాకీ చిత్రం ఇప్పటికే విడుదలై పర్వాలేదనిపించగా, అతనితోనే దేవ్ చిత్రంలో నటిస్తోంది. ఇక సూర్యతో కూడా జతకట్టిన ఈ భామ ఇటీవల బాలీవుడ్‌లో మరో ఆఫర్ కొట్టేసింది.

తాజాగా సోషల్ మీడియాలో రకుల్ పెళ్లిపై రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్‌పెట్టి సినిమాలతో బిజీగా గడుపుతున్న రకుల్.. వయసు అయిపోతుందని త్వరలో పెళ్లిచేసుకుంటే మంచిదని ఆమె తల్లి ఫోర్స్‌చేస్తోందట. రకుల్‌కు పెళ్లిచేయాలని ఆమె తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారని.. ఈ క్రమంలో రకుల్ కుటుంబ సభ్యులు పెళ్లికొడుకుని వెదికే పనిలోఉన్నారనే టాక్ బయటకు వచ్చింది.

అయితే ఈ వార్త రకుల్ దగ్గరకు వెళ్ళడంతో తన పెళ్లి గురించి కుటుంబ సభ్యులు తొందరపడుతోంది నిజమే అని.. నాకుకూడా పెళ్లిచేసుకోవాలని ఉందని మంచి అబ్బాయిని చూడమని తన స్నేహితులకి కూడా చెప్పానని రకుల్ చెప్పినట్టు సమాచారం. దీంతో త్వరలోనే రకుల్ పెళ్లిచేసుకునే అవకాశాలు ఉన్నాయని టాక్ స్ప్రెడ్ అయింది.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *