Main Menu

టాలీవుడ్ స్టార్ ప్రేమలో రకుల్?

Spread the love

రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో ఇప్పటికే తానేంటో నిరూపించుకుంది. పైగా హైదరాబాద్ లో వ్యాపారాాలు కూడా ప్రారంభించింది. అయితే తాజాగా ఆమెకు అవకాశాలు కొంత సన్నగిల్లాయి. దాంతో ఆమె బాలీవుడ్ వైపు కన్నేసింది. అయ్యారి సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దగ్గుబాటి రానాతో రకుల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సమంతా, నాగ చైతన్య ప్రేమ వ్యవహారం పెళ్లి పీటలు ఎక్కడంతో తాజాగా రానా, రకుల్ ప్రేమ వ్యవహారాలు టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది.

తాజాగా రానాతో రకుల్ డేటింగ్ లో ఉందనే వార్తలు చివరకు రకుల్ ని కూడా చేరాయి. ఆమెను కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దానికి సమాధానం చెబుతూ ‘ఇలాంటి వార్తలను మేం (రకుల్‌, రానా) విన్నాం. వీటిని విన్నప్పుడల్లా ఇద్దరం నవ్వు ఆపుకోలేకపోయే వాళ్లం. ఇవి కేవలం వదంతులు మాత్రమే. నేను, రానా చాలా మంచి స్నేహితులం. నాకు ఏ అవసరం వచ్చినా రానా ముందుంటాడు. నేను ఇంటికి దూరంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా. ఇక్కడ నాకు 15 నుంచి 20 మంది స్నేహితులతో కూడిన బృందం ఉంది. ఇందులో నేనూ, రానా ఇద్దరం. కాబట్టి కలిసి సమయం గడుపుతుంటాం, మా ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే. మా స్నేహితుల బృందంలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఇంకా సింగిల్‌గా ఉన్నారు. కాబట్టి మిగిలిన వారి గురించి వదంతులు సృష్టిస్తుంటారు’ అని ఆమె తెలిపింది రకుల్‌.

అనంతరం పెళ్లి గురించి మాట్లాడుతూ.. నా జీవితంలో ప్రేమకు స్థానం దక్కినప్పుడు.. దాన్ని దాచి పెట్టకుండా నేనే ప్రకటిస్తా. నా వృత్తికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నన్ను అర్థం చేసుకుంటాడని అంటున్నారు. కానీ మనం ఎవరితో ప్రేమలో పడుతామో ముందుగానే వూహించలేం కదా’ అని అంది. అయితే సహజంగానే సినిమా పరిశ్రమకు చెందిన వారంతా ఇదే రీతిలో స్పందించడం ఆనవాయితీగా వస్తోంది కాబట్టి..రకుల్ మాటల్లో వాస్తవం ఎంత అనే విషయం గుసగుసలకు తావిస్తోంది.


Related News

నంద్యాలపై నారా లోకేష్ క‌న్ను!

Spread the loveకర్నూలు జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. నంద్యాల నియోజకవర్గం నుండి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ పోటీచేస్తారనే ప్రచారంRead More

బాబు మీద గురిపెట్టి ఏపీకి మ‌ళ్లీ అన్యాయం..!

Spread the loveరాక రాక వ‌చ్చారు. కానీ ఏదో చేస్తార‌ని ఆశించిన వాళ్ల‌ను నిరాశ‌లో ముంచారు. ఏదో ఒక హామీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *