పీకల్లోతు ప్రేమలో రాయ్ లక్ష్మీ

lakshmi rai
Spread the love

ఏదో ఒక సంచలన చర్యతో నిత్యం వార్తల్లో ఉండే నటి రాయ్‌లక్ష్మి. ఈత దుస్తులే కాదు ఎలాంటి గ్లామరస్‌ పాత్రనైనా చేయడానికి రెడీ అనే ఈ బ్యూటీ ఐటమ్‌ సాంగ్‌లకు సై అంటుంది. ఆ మధ్య క్రికెటర్‌ ధోనీతో డేటింగ్‌ అంటూ కలకలం సృష్టించిన రాయ్‌లక్ష్మి, ఇటీవల ధోని ఎవరూ అంటూ అందరికీ షాక్‌ ఇచ్చింది.ఆ తరువాత ధోని మంచి ఫ్రెండ్‌ అంటూ సవరించుకుందనుకోండి. ఈ అమ్మడు కోలీవుడ్‌ తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది.

లారెన్స్‌ సరసన మొట్టశివ కెట్టశివ చిత్రంలో ఒక సింగిల్‌ సాంగ్‌లో నటించిన రాయ్‌లక్ష్మి ఆపై కోలీవుడ్, బాలీవుడ్‌ అంటూ చక్కర్లు కొడుతోంది. తెలుగులో చిరంజీవి 150వ చిత్రం ఖైధీనంబర్‌ 150లో రత్తాలు రత్తాలు అంటూ ఆయనతో చిందులేసి తెలుగు ప్రేక్షకులను కిర్రెక్కించిన రాయ్‌లక్ష్మి తాజాగా బాలీవుడ్‌లో జూలి–2 చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. అయితే ఆ చిత్ర టీజర్‌ ఈ మధ్య విడుదలైంది. అందులో రాయ్‌లక్ష్మి అందాల మోతకు సినీ జనాలు ఔరా ‘అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

టీజరే ఇలా ఉంటే మెయిన్‌ పిక్చర్‌ ఎలా ఉంటుందోనన్న క్యూరియాసిటీ సినీ ప్రియుల్లోనూ నెలకొంది. ఈమె సినిమాల కథ ఇలా ఉంటే వ్యక్తిగతం విషయానికి వస్తే ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందనే ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. గత కొద్ది కాలంగా బాలీవుడ్‌లోనే మకాం పెట్టిన రాయ్‌లక్ష్మి, బాలీవుడ్‌ మోడల్, నటుడు హనీఫ్‌ హీలాల్‌ అనే అతనితో లవ్‌లో పడిపోయ్యిందట. తరచూ వీరిద్దరు డేట్‌ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. దీనికి రాయ్‌లక్ష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి.


Related News

ileana-759

ఇల్లూ బేబీ పెళ్లి…

Spread the loveగోవా బ్యూటీ ఇలియానా రహస్యంగా పెళ్లిచేసేసుకుందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇలియానా.. ఆస్ట్రేలియాకి చెందిన ఫొటోగ్రాఫర్‌Read More

kotla suryaprakash

జగన్ గూటికి కోట్ల: ముహూర్తం సిద్ధం

Spread the loveకర్నూలు ఎంపీ సీటుపై క్లారిటీ రావడంతో మాజీ కేంద్ర మంత్రి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికేRead More

 • యాత్రను అడ్డుకుంటే జగన్ కే మేలు!
 • కొత్త అవతారంలో హీరో
 • 60ఏళ్ల నటుడితో నమిత ప్రేమాయణం
 • పీకల్లోతు ప్రేమలో రాయ్ లక్ష్మీ
 • తాప్సీ రెండో ఇల్లు..
 • డేటింగ్ కి సై అంటున్న బ్యూటీ
 • అజ్ఞాతవాసిగా మారాలనుకుంటున్న పవర్‌స్టార్‌..!
 • భారతీయుడు సీక్వెల్ సిద్ధం..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *