అజ్ఞాతవాసిగా మారాలనుకుంటున్న పవర్‌స్టార్‌..!

pspk pawan
Spread the love

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను చిత్రయూనిట్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం. పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. గతంలో ‘జల్సా’ ‘అత్తారింటికి దారేదీ’ చిత్రాలు ప్రేక్షకుల విశేష ఆదరణతో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా వస్తున్న చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత ‘ఇంజనీరింగ్‌ బాబు’, ‘దేవుడే దిగివచ్చిన’ వంటి టైటిల్స్‌ వినిపించినప్పటికీ ఫైనల్‌గా ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ అయితే బాగుంటుందనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఇటీవల పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కాన్సెప్ట్‌ పోస్టర్‌ రూపంలో విడుదల చేశారు. అందులో ఒంటరిగా వెళ్తున్న పవన్‌ ఫొటో కనిపిస్తుంది. దాని ప్రకారం కథకు అనుగుణంగానే ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను కన్ఫమ్‌ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో పవన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపిస్తుండగా, ఆయన సరసన కీర్తి సురేష్‌, అనుఇమ్మాన్యుయెల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.






Related News

Vijayasai-Reddy

వైసీపీతో మంత్రి మంత‌నాలు?

Spread the loveఏపీలో ప‌లువురు ఎమ్మెల్యేలు మాతో ట‌చ్ లో ఉన్నార‌ని వైసీపీ ప్ర‌క‌టించింది. టీడీపీ ఎంపీలు త‌మ‌వైపు రావ‌డానికిRead More

jagan ys

అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్న వైసీపీ!

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీకి అభ్య‌ర్థులు కావాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త నేత‌లు అత్య‌వ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టుగా వేటRead More

  • శ్రీరెడ్డికి భారీ ఛాన్స్
  • ప‌వ‌న్ ఎఫెక్ట్: బాబు స‌న్నిహితుడిపై వేటు?
  • స్వ‌రం మార్చేస్తున్న స‌మంత‌
  • సుకుమార్ రంగ‌స్థ‌లానికి కులం రంగులు…
  • క‌ర్ణాట‌క బ‌రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
  • జ‌న‌సేన‌లో తొలి వికెట్ ప‌డిందా..?
  • జేడీ మ‌రో జేపీ అవుతారా..?
  • రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *