Main Menu

సీఎం సొంత జిల్లాలోముగ్గురిని భూతాలు చంపేసాయి…!

Spread the love

ముగ్గురి రైతుల మరణానికి కారణం భూతప్రేతాలేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. భూత, ప్రేత, పిశాచాలు నిజంగా ఉంటే ఈ వార్త విని బాధపడతాయేమో!బుధవారం శాసనసభలో రాష్ట్ర హోం శాఖ ఈ ప్రకటన చేసింది. తప్పించుకునే దారిలేనపుడు కనిపించని శక్తులపై నెట్టేసి చేతులు దులుపుకోవడం తేలిక కదా!

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత ఇలాకా సెహోర్ జిల్లాలో పంట నష్టం వల్ల 2014-2016 మధ్య కాలంలో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర పటేల్ శాసనసభలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన శైలేంద్ర స్పీకర్‌నుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం దెయ్యాలు, భూతాలను నమ్ముతోందా అని ప్రశ్నించారు. హోం మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ మృతుల కుటుంబీకులు చెప్పిన వివరాలనే తాము పేర్కొన్నామన్నారు. 2014లో సెహోర్ జిల్లాలో 418 మంది ఆత్మహత్య చేసుకున్నారని, వీరిలో 117 మంది మరణానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియదని చెప్పారు.






Related News

‘గవర్నర్‌ గిరీ’ కోసం మిత్రపక్షాల వైరం …

Spread the loveమిత్రపక్షాల వైరం ముదిరినట్టే ఉంది. బీజేపీ- టీడీపీల మధ్య పదవుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతంRead More

‘ఆవాజ్’తో సిద్ధు కొత్త ఇన్నింగ్స్…

Spread the loveక్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు.. క్రికెట్ లాగే,అతని రాజకీయ జీవితంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *