Main Menu

శాసనసభ అభ్యర్థి అదృశ్యం…

Spread the love

బహుజన సమాజ్‌వాద్‌ పార్టీ (బీఎస్‌పీ) శాసనసభ అభ్యర్థి మహమ్మద్‌ అరీఫ్‌ కనిపించడం లేదు. దిల్లీ నుండి ముజఫర్‌నగర్‌ వెళ్తున్న ఆయన మీరట్‌లో కనినపించకుండా పోయారు. ఆయన అపహరణకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కారు మంగళవారం సాయంత్రం మీరట్‌ జిల్లాలోని కంకేర్‌ ఖేరా పోలీసుస్టేషన్‌ పరిధిలో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
40 ఏళ్ల అరీఫ్‌ వృత్తిరీత్యా వ్యాపారి. 2017లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బుధనా నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. అరీఫ్‌ మంగళవారం ఉదయం ముజఫర్‌నగర్‌ నుండి రూ.10 లక్షలు తీసుకొని బయల్దేరి వెళ్లిన ఆయన ఇంకా ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్ని సార్లు ఫోను చేసినా స్పందించడం లేదన్నారు. ఆయనకోసం అన్వేషించగా మీరట్‌లో అతని కారు కనిపించిందని.. అది లాక్‌ చేసి ఉందని తెలిపారు. మాజీ బీఎస్‌పీ అభ్యర్థి నయీమ్‌కి ఈ అపహరణతో సంబంధం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించగా.. బీఎస్‌పీ ఎమ్మెల్సీ, మీరట్‌ జోన్‌ కోఆర్డినేటర్‌ అతార్‌ సింగ్‌ రావ్‌ దీనిని ఖండించినట్లు ఎస్‌పీ ఓం ప్రకాశ్‌ తెలిపారు.
అరీఫ్‌ మద్దతుదార్లు, కుటుంబ సభ్యులు ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టి.. కొద్ది గంటల పాటు కర్నాల్‌- మీరట్‌ రహదారిపై రాకపోకల్ని అడ్డుకున్నారు.






Related News

‘గవర్నర్‌ గిరీ’ కోసం మిత్రపక్షాల వైరం …

Spread the loveమిత్రపక్షాల వైరం ముదిరినట్టే ఉంది. బీజేపీ- టీడీపీల మధ్య పదవుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతంRead More

‘ఆవాజ్’తో సిద్ధు కొత్త ఇన్నింగ్స్…

Spread the loveక్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు.. క్రికెట్ లాగే,అతని రాజకీయ జీవితంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *